Ryan Rickelton : ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తున్న ముంబై ఓపెనర్.. ఆస్ట్రేలియాకు దబిడి దిబిడే..
ముంబై విజయాల్లో ఆ జట్టు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ తన వంతు పాత్ర పోషించాడు.

Ryan Rickelton continues IPL form ahead of WTC 2025 final
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మెరుగైన ప్రదర్శన చేసింది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయి తృటిలో ఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. ముంబై విజయాల్లో ఆ జట్టు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ తన వంతు పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ జతగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు 14 మ్యాచ్‌ల్లో 30 సగటు 155 స్ట్రైక్‌రేటుతో 388 పరుగులు చేశాడు.
జూన్ 11 నుంచి 15 వరకు లండన్‌లోని లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు టెస్టు ఛాంపియన్ గద కోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే రెండు దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఈ ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొనే తమ తమ జట్లను ఎంపిక చేశాయి. దక్షిణాఫ్రికా తరుపున రికెల్టన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
Virat Kohli : ఐపీఎల్ అయిపోయింది.. మళ్లీ కోహ్లీ మైదానంలో కనపడేది అప్పుడేనా..! ఇదేం ట్విస్ట్..
View this post on Instagram
కాగా.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టు లార్డ్స్ వేదికగానే జింబాబ్వేతో ఓ వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ రికెల్టన్ హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్ 11 ఫోర్ల సాయంతో 62 పరుగులు సాధించాడు.
LSG : లక్నో జట్టులో మార్పులు తప్పవు..! తొలి వేటు అతడిపైనే..? పాపం ఒక్క ఏడాదికే..
ఇక ఇదే ఊపును అతడు ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై కొనసాగించాలని సఫారీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి డబ్ల్యూటీసీ టైటిల్‌ను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.