England Jack Leach : ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ జాక్‌లీచ్‌కు గాయం.. పార్కిన్సన్‌కు చోటు!
England Jack Leach : ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సమయంలో లీచ్ తలకు గాయమైంది.

England's Jack Leach Withdrawn From 1st Test Vs Nz Following Head Injury; Parkinson Named Replacement
England Jack Leach : ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సమయంలో లీచ్ తలకు గాయమైంది. గాయం కారణంగా తొలి టెస్టు నుంచి జాక్ లీచ్ తప్పుకున్నాడు. న్యూజిలాండ్ తో తొలి టెస్టు ఆరంభమైన మొదటిరోజునే గాయంతో లీచ్ జట్టును వీడాల్సి వచ్చింది. లీచ్ స్థానంలో మ్యాట్ పార్కిన్సన్ జట్టులోకి వచ్చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో న్యూజిలాండ్ జట్టు లార్డ్స్ వేదికగా ఆతిథ్య జట్టుతో తలపడుతోంది.
తొలి టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ సమయంలో ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ ఫీల్డింగ్ చేస్తుండగా తలకు గాయమైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. గాయమైన ఆటగాడికి విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది.
Lancashire spinner Matthew Parkinson has been confirmed as Jack Leach’s concussion replacement.
He will join the camp later today and can go straight into our XI.
— England Cricket (@englandcricket) June 2, 2022
దాంతో జాక్ లీచ్ తొలి టెస్టు నుంచి తప్పుకున్నాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) ప్రకటన విడుదల చేసింది. లీచ్ స్థానంలో పార్కిన్సన్ కు చోటు దక్కింది. లీచ్ స్థానంలో వచ్చిన పార్కిన్సన్ కేవలం ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది.
Read Also : Best Sports Bikes: 2021లో వచ్చిన టాప్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే