EX Australia cricketers critisie to Rohit after his reaction of Jaiswals drop catches
మెల్‌బోర్న్ టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నాథన్‌లైయన్ (41), స్కాట్ బొలాండ్ (10) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఆసీస్ ఎప్పుడో ఆలౌట్ కావాల్సింది. టీమ్ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ నాలుగో రోజు మూడు క్యాచులను వదిలివేయడం కూడా ఆసీస్‌కు బాగా కలిసి వచ్చింది.
ముఖ్యంగా ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్నస్ లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో యశస్వి జైస్వాల్ వదిలి వేశాడు. దీంతో లబుషేన్ వచ్చిన అవకశాన్ని సద్వినియోగం చేసుకుని 70 పరుగులు చేశాడు. కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అలాగే.. పాట్ కమిన్స్ క్యాచ్‌ను జైస్వాల్ జారవిడిచాడు. కమిన్స్ 41 పరుగులతో రాణించాడు.
కాగా.. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో లబుషేన్ క్యాచ్‌ను జైస్వాల్ వదిలివేసిన సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురైయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే.. రోహిత్ ప్రవర్తించిన తీరును నెటిజన్లతో పాటు పలువురు మాజీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు తప్పుబడుతున్నారు.
ఆ సమయంలో యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్ నుంచి చాలా మద్దతు అవసరం అని ఆసీస్ మాజీ ఆటగాడు మైక్ హస్సీ అన్నాడు. కావాలని ఎవ్వరూ క్యాచులు వదిలిపెట్టరని అన్నాడు. క్యాచులు వదిలివేసినందుకు అప్పటికే యశస్వి చాలా బాధపడి ఉంటాడని చెప్పాడు. ఆ సయమంలో అతడికి జట్టు మద్దతు ఎంతో అవసరం అని అన్నాడు. ముఖ్యంగా కెప్టెన్ యొక్క చర్యలు ఎంతో ముఖ్యమని చెప్పాడు. అవి అతడిని ప్రోత్సహించేలా ఉండాలి గానీ అతడి పై ఒత్తిడి పెంచేలా ఉండొద్దని హస్సీ అన్నాడు.
జైస్వాల్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం చాలా కీలకమని, అతడు లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాడని ఆస్ట్రేలియా మహిళా కెప్టెన్ అలిస్సా హీలీ అభిప్రాయపడింది. అతడు ఓపెనర్ బ్యాట్స్‌మెన్. కాబట్టి అతడు లక్ష్య ఛేదన సమయంలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేలా వాతావరణం ఉండాలి. అప్పుడే అతడు తనలోని ప్రతిభను బయటికి తీయగలడు. అది జట్టుకు మేలు చేకూర్చుతుంది. తప్పులపై మ్యాచ్ తరువాత దృష్టి సారిస్తే బాగుంటుందని అంది.
IND vs AUS : ఓవైపు మ్యాచ్ జరుగుతుండగానే.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..
కాగా.. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆ సమయంలో జైస్వాల్‌ను ఓదార్చాడు. ఏం కాదులే అని భరోసా ఇచ్చాడు. ఈ చర్యను ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లీమాన్ ప్రశంసించారు. పంత్ సరైన పని చేశాడన్నారు. వదిలేసేయ్.. మనందరం క్యాచులు వదిలేస్తుంటామ్ ఏం కాదులే అని చెప్పాడు. అలాంటి నాయకత్వం అవసరం. తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక జట్టుగా ఎలా స్పందిస్తాము అనేది చాలా ముఖ్యం అని తెలిపాడు. ఈ విషయాలను వదిలివేసి..యశస్వి తన ఆట పై దృష్టి పెట్టాలని సూచించాడు.
Rohit Sharma is furious after Jaiswal dropped the catch of Labuschagne.
He has captained exceptionally so far to turn around the match! pic.twitter.com/6R2zej5o51
— Keh Ke Peheno (@coolfunnytshirt) December 29, 2024