Fans angry on BCCI and demand boycott asia cup
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న టోర్నీల్లో ఆసియా కప్ 2025 ఒకటి. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9న ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ దేశాలు గ్రూప్-ఏలో ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ దేశాలు గ్రూప్-బిలో ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థి భారత్, పాక్ దేశాలు ఒకే గ్రూపులో ఉండగా సెప్టెంబర్ 14న వీటి మధ్య మ్యాచ్ జరగనుంది. అన్ని అనుకూలిస్తే.. సెప్టెంబర్ 21న సూపర్ 4 దశలో మరోసారి పోటీపడనున్నాయి.
ENG vs IND : శుభ్‌మన్ గిల్- కేఎల్ రాహుల్ అద్భుత రికార్డు.. గత 54 ఏళ్లలో ఇదే తొలిసారి..
అయితే.. పాకిస్థాన్‌తో ఆడాలనే నిర్ణయం భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. పహల్గాం ఉగ్ర దాడి తరువాత ఇకపై అంతర్జాతీయ వేదికల్లోనూ పాక్ జట్టుతో భారత్ ఆడకూడదని మాజీలు, ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వరల్డ్ ఛాంపియన్ షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్స్‌తో భారత్ ఛాంపియన్స్ మ్యాచ్ రద్దైంది.
ఇలాంటి సమయంలో ఆసియాలో కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లు ఆడేదే లేదని బీసీసీఐ చెప్పాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అవసరం అనుకుంటే టోర్నీనే బాయ్‌కాట్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రజల, సైనికుల ప్రాణాల కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యమా? అని పలువురు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.
చూడాలి మరి బీసీసీఐ దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటుందో..