FIFA World Cup 2026 : ఆస్ట్రియా గోల్ కొట్టినా ఇవ్వని రిఫరీ.. అతడే కారణం.. ఆ ఒక్కడు చూడకుంటే..?
ఫిఫా ప్రపంచకప్2026లో(FIFA World Cup 2026 ) జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రియా ఆటగాడు కొట్టిన ఓ గోల్‌ను ఇవ్వలేదు.
FIFA World Cup 2026 Why was Arnautovic goal ruled out in Austria vs Jordan
FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆస్ట్రియా విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్-జేలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జోర్డాన్ తో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా గోల్ కొట్టినా ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
మ్యాచ్ ప్రారంభం నుంచి ఆస్ట్రియా దూకుడుగా ఆడింది. మిడ్‌ఫీల్డర్ రొమానో ష్మిడ్ బాక్స్ వెలుపల నుంచి అద్భుతమైన షాట్‌తో గోల్ సాధించడంతో ఆస్ట్రియా 1-0 ఆధిక్యంలో వెళ్లింది. తొలి అర్థభాగం ముగిసే సమయానికి కూడా ఆస్ట్రియా ఆధిక్యంలోనే ఉంది. ఇక రెండో అర్థభాగం ప్రారంభంలోనే జోర్డాన్ గోల్ చేసి స్కోరును సమం చేసింది. 50వ నిమిషంలో అలీ ఇయాద్ ఒల్వాన్ బాక్స్ అంచు నుంచి కర్లింగ్ షాట్ కొట్టగా బంతి పోస్టును తాకి గోల్‌లోకి వెళ్లింది.
Lionel Messi : ఫిఫా ప్రపంచకప్ 2026లో తొలి గోల్ కొట్టగానే కన్నీటిపర్యంతమైన మెస్సీ..
స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. ఈ సమయంలో మ్యాచ్ 66వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్కో ఆర్నాటోవిచ్ గోల్ చేయడంతో ఆస్ట్రియా మరోసారి ముందంజలోకి వెళ్లిందనిపించింది. అయితే.. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) పరిశీలనలో బంతి ఆస్ట్రియా ఆటగాడు స్టెఫాన్ పోష్ చేతిని తాకినట్లు గుర్తించారు. సుదీర్ఘ సమీక్ష అనంతరం ప్రధాన రిఫరీ కూడా గోల్‌ను రద్దు చేశారు. దీంతో ఆస్ట్రియా నిరాశలోకి వెళ్లింది.
అయితే కొద్ది సేపటికే ఆస్ట్రియాకు అదృష్టం కలిసి వచ్చింది. కార్నర్‌ను క్లియర్ చేయబోయిన జోర్డాన్ డిఫెండర్ యజాన్ అల్-అరబ్ పొరపాటున బంతిని తన జట్టు గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో ఆస్ట్రియా ఆధిక్యం 2-0కి చేరింది. ఇక ఆట అదనపు సమయంలో ఆస్ట్రియాకు పెనాల్టీ లభించగా.. ఆర్నాటోవిచ్ దానిని గోల్‌గా మలిచాడు. దీంతో ఆస్ట్రియా 3-1తో విజయం సాధించింది.
