FIR నమోదు: పరారీలో ఉన్న హాకీ ప్లేయర్ ముఖేశ్

హైదరాబాద్ హాకీ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఎన్.ముఖేశ్ కుమార్‌పై కేసు నమోదైంది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించాడనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు. జనవరి 25న కేసు నమోదు కాగా, ప్రస్తుతం విచారణ జరుగుతుండగా నేర నిరూపణ అయితే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.
అతనిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులకు షాక్ ఎదురైంది. విషయం తెలుసుకున్న ముఖేశ్ అప్పటికే పరారీలో ఉన్నాడట.
అతనిపై 2007లోనే ఇండియన్ ఎయిర్‌లైన్స్ విజిలెన్స్ కులానికి సంబంధించిన విచారణ జరిపించాలని హైదరాబాద్ కలెక్టర్‌కు ఆదేశించింది. సికింద్రాబాద్ తహసీల్దార్ నుంచి మాల కులానికి చెందిన వ్యక్తిగా సర్టిఫికేట్లు పొందినట్లు సమాచారం. బోయిన్‌పల్లి పోలీసులు ముఖేశ్‌తో పాటు అతని సోదరుడు కూడా ఈ మోసంలో భాగంగా ఉన్నాడని భావిస్తున్నారు.
ముఖేశ్ 307 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 80వరకూ గోల్స్ చేశాడు. మూడు సార్లు (1992, 1996, 2000లలో) ఒలింపిక్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. నిజానికి ముఖేశ్ నాయీ బ్రాహ్మిణ్(బీసీ-ఏ)కేటగిరీకి చెందిన వ్యక్తి.