Former Pakistan captain Inzamam ul Haq asks other boards to boycott IPL
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్‌ను బహిష్కరించాలని అతడు అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు పిలుపునిచ్చాడు. టీమ్ఇండియా ఆటగాళ్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వాలని, అలా కానీ పక్షంలో అన్ని దేశాల బోర్డులు ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లను పంపకూడదని అన్నాడు.
“ఛాంపియన్స్ ట్రోఫీని పక్కన పెట్టండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ పాల్గొనే ఐపీఎల్‌ను చూడండి. కానీ భారత ఆటగాళ్లు ఇతర లీగ్‌లలో ఆడటానికి వెళ్లరు. అందువల్ల.. అన్ని బోర్డులు తమ ఆటగాళ్లను ఐపీఎల్‌కు పంపడం మానేయాలి. మీరు ఏదైనా లీగ్‌కు మీ ఆటగాళ్లను విడుదల చేయకపోతే.. ఇతర బోర్డులు వైఖరి తీసుకోకూడదా?” అని ఇంజమామ్ పాకిస్తాన్‌లోని ఒక స్థానిక వార్తా ఛానెల్‌లో మాట్లాడుతూ అన్నాడు.
Every board should stop sending their players in IPL: Inzimam UL Haq pic.twitter.com/8vp8OjEjV3
— ٰImran Siddique (@imransiddique89) March 13, 2025
ఏ భారతీయ ఆటగాడు కూడా విదేశీ లీగ్‌లల్లో ఆడేందుకు అనుమతి లేదు. కేవలం ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు మాత్రమే ఆ అవకాశం ఉంది. గతేడాది దినేష్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. ఆ తరువాత అతడు సౌతాఫ్రికా20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ తరుపున ఆడాడు. ఇక యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి వారు జీటీ20 కెనడా, లంక ప్రీమియర్ లీగ్ వంటి టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు.
అయితే.. ఈ నియమం మహిళా క్రికెటర్లకు వర్తించదు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ వంటి స్టార్ ప్లేయర్లు బీబీఎల్, ది హండ్రెడ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర లీగ్‌లలో పాల్గొంటారు. భారత పురుష క్రికెటర్లకు మాత్రమే విదేశాల్లోని లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి లేదు.
Celebrating a decade of HBL PSL with a spectacular trophy unveiling in Karachi’s coastal waters 🌊
Presenting 𝙇𝙪𝙢𝙞𝙣𝙖𝙧𝙖 – the #HBLPSLX prize – in all its glory 🏆 pic.twitter.com/uRh7aiOZW6
— PakistanSuperLeague (@thePSLt20) March 13, 2025
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక.
Hazratullah Zazai : అఫ్గాన్ క్రికెటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం.. చనిపోయిన కూతురు..
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు జరగనుంది. గురువారం పీఎస్ఎల్ ట్రోపీని కరాచీ తీరపాంత్ర జలాల్లో ఆవిష్కరించారు.