West Indies : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు వెస్టిండీస్‌కు భారీ షాక్‌.. ఒకేసారి న‌లుగురు ప్లేయ‌ర్ల రిటైర్‌మెంట్‌

వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది.

West Indies : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు వెస్టిండీస్‌కు భారీ షాక్‌.. ఒకేసారి న‌లుగురు ప్లేయ‌ర్ల రిటైర్‌మెంట్‌

Four World Cup winning West Indies players announce retirement

West Indies : ఒక‌ప్పుడు ప్ర‌పంచ క్రికెట్‌ను ఏలింది వెస్టిండీస్‌. రాను రాను ఆ జ‌ట్టు ఆట‌తీరు తీసిక‌ట్టుగా మారింది. అయితే.. మ‌ధ్య‌లో కొన్ని మెరుపులు మెరిపించిన‌ప్ప‌టికీ నిల‌క‌డ‌లేమీ స‌మ‌స్య‌గా మారింది. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. 2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులోని న‌లుగురు స‌భ్యులు ఒకేసారి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించారు. విండీస్ మ‌హిళా జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించిన మీడియం పేస‌ర్ షకేరా సెల్మాన్, స్పిన్న‌ర్‌ అనిసా మొహమ్మద్, క‌వ‌ల‌ల సోద‌రీమ‌ణులు కైసియా నైట్, కిషోనా నైట్ ఆట‌కు వీడ్కోలు ప‌లికారు. ఈ విష‌యాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సైతం ధ్రువీక‌రించింది.

ఆఫ్ స్పిన్న‌ర్ అనిసా మొహమ్మద్ 2003లో అరంగ్రేటం చేసింది. 141 వ‌న్డేలు, 117 టీ20 మ్యాచుల్లో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వ‌హించింది. వ‌రుస‌గా 180, 125 వికెట్లు ప‌డ‌గొట్టింది. వెస్టిండీస్ త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. అంతేకాదు.. టీ20 క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి వెస్టిండీస్ బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. ఆమె త‌న కెరీర్‌లో 12 ప్ర‌పంచ‌క‌ప్ (5వ‌న్డే, 7 టీ20) లు ఆడింది.

20 సంవ‌త్స‌రాల త‌న కెరీర్ అద్భుతంగా సాగింద‌ని, ప్ర‌తి ఒక్క క్ష‌ణాన్ని తాను ఆస్వాదించిన‌ట్లు అనిసా మొహమ్మద్ చెప్పింది. త‌న కెరీర్‌లో 258 సార్లు వెస్టిండీస్ జెర్సీ ధ‌రించి మైదానంలోకి దిగే అవ‌కాశం ల‌భించింద‌ని చెప్పింది. ఇక ఆట‌లో ఒడిదొడుకులు స‌హ‌జం అని, యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని తెలిపింది.

NZ vs PAK : గెలుపు సంగ‌తే మ‌రిచిపోయిన పాకిస్తాన్‌.. వ‌రుస‌గా నాలుగో టీ20లోనూ ఓట‌మి..

మీడియం పేస‌ర్ ష‌కేరా సెల్మాన్ 2008లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. 100 వ‌న్డేలు, 96 టీ20లు ఆడింది. వ‌రుస‌గా 82, 51 వికెట్లు తీసింది. గొప్ప‌వారితో క‌లిసి క్రికెట్ ఆడినందుకు తాను గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు ష‌కేరా తెలిపింది. ఆట ప‌ట్ల నా అభిరుచిని కొత్త మార్గాల్లో పంచుకోవ‌డానికి ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పింది. త‌న కెరీర్‌కు స‌హ‌క‌రించిన అంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది.

రెండేళ్ల తేడాతో..

ట్విన్ సిస్ట‌ర్స్ అయిన కైసియా, కైషోనా నైట్ లు రెండేళ్ల తేడాతో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. కైసియా 2011లో కైషోనా లు 2013లో అరంగ్రేటం చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కైసియా 87 వ‌న్డేలు 70 టీ20లు ఆడింది. వ‌న్డేల్లో 1,372, టీ20ల్లో 801 ప‌రుగులు చేసింది. కైషోనా 51 వన్డేలు, 55 టీ20లు ఆడింది. వ‌న్డేల్లో 851 ప‌రుగులు, టీ20ల్లో 546 ప‌రుగులు చేసింది.

Dhoni fan : ధోనీ వీరాభిమాని ఆత్మ‌హ‌త్య‌.. త‌న ఇంటినే సీఎస్‌కే రంగుల‌తో నింపిన వ్య‌క్తి..

కాగా.. బంగ్లాదేశ్ వేదిక‌గా ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ వేదిక‌గా మ‌హిళల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది.