IPL 2025 : జోష్ హేజిల్‌వుడ్ నుంచి మయాంక్ అగర్వాల్ వరకు.. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కాకముందే గాయాల బారిన పడిన ప్లేయర్లు వీరే..
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ పై పడింది.

Full list of injured players before IPL 2025 start Josh Hazlewood to Mayank Yadav
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమ్ఇండియా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది భారత్. దీంతో ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగిపోయారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ పై పడింది.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం కానుంది. మే 25 వరకు జరగనుంది. మరో రెండు వారాల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే.. పలు ప్రాంఛైజీలు గాయాలతో సతమతమవుతున్నాయి. కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడడంతో వారికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై సదరు ప్రాంచైజీలు దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఇప్పటి వరకు గాయపడిన ఆటగాళ్లు వీరే..
* జోష్ హేజిల్‌వుడ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – సైడ్ స్రైయిన్
* అన్రిచ్ నోర్ట్జే – కోల్‌కతా నైట్ రైడర్స్ – వెన్నుగాయం
* జెరాల్డ్ కోట్జీ – గుజరాత్ టైటాన్స్ – స్నాయువు గాయం
*మిచెల్ మార్ష్ – లక్నో సూపర్ జెయింట్స్ – నడుము కింది భాగంలో గాయం
* జాకబ్ బెథెల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – స్నాయువు గాయం
* మయాంక్ యాదవ్ – లక్నో సూపర్ జెయింట్స్ – వెన్ను గాయం
* లిజాద్ విలియమ్స్ – ముంబై ఇండియన్స్ – మోకాలి గాయం
* అల్లా గజన్‌ఫర్ – ముంబై ఇండియన్స్ – వెన్నుగాయం
ఇందులో కొందరు ఆటగాళ్లు పూర్తి ఐపీఎల్ 2025 సీజన్‌కు దూరంగా కాగా.. మరికొందరు ఎప్పుడు ఈ సీజన్‌లో బరిలోకి దిగుతారో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. అతడు ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.