పద్మ అవార్డులు అందుకున్న గంభీర్.. హారిక ద్రోణవల్లి

పద్మ అవార్డులు అందుకున్న గంభీర్.. హారిక ద్రోణవల్లి

Updated On : March 16, 2019 / 1:49 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ గౌతం గంభీర్.. ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రిలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న 8మంది క్రీడాకారులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ విషయాన్ని గౌతీ అన అధికారిక ట్విట్టర్ ద్వారా సగౌరవంగా పంచుకున్నాడు. 

‘ఇది నేను భారత క్రికెట్‌ ఆడేలా ప్రోత్సాహించిన వారికి, ఆడలేవంటూ విమర్శించిన వారి కోసం అందుకున్నాను. నా ఈ క్రీడా ప్రయాణంలో రెండూ బాగా పనిచేశాయి. ఒకానొక రోజు చర్చించుకుంటారు ఎవరికంటే ఎవరు బాగా ఆడారనేది’ అని గౌతం గంభీర్ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. 

గంభీర్‌, చెత్రిలతో పాటు ఆర్చరీ స్టార్ బొంబేలా దేవీ, రెజ్లర్ భజరంగ్ పూనియా, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్, కబడ్డీ స్టార్ అజయ్ ఠాకూర్, చెస్ ప్లేయర్ హారిక ద్రోణవల్లి, బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రశాంతి సింగ్‌లు అవార్డులు అందుకున్నారు.