గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం.. యాక్టివ్ పాలిటిక్స్‌కు గుడ్‌బై!

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యాక్టివ్ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాలని ఆయన భావిస్తున్నారు.

Gautam Gambhir announced to step away from active politics

Gautam Gambhir: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన భావిస్తున్నారు. తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు గంభీర్ ధన్యవాదాలు తెలిపారు. ఇకపై పూర్తిస్థాయిలో క్రికెట్ పై ఫోకస్ పెడతానని ట్విటర్ ద్వారా తెలిపారు. గంభీర్ ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.

క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్ 2019, మార్చిలో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఢిల్లీలో బీజేపీకి ముఖ్య నాయకుడిగా మారిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానం నుంచి కమలం పార్టీ తరపున పోటీ చేసి 6,95,109 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో తనకు టికెట్‌ లభించకపోవచ్చనే వార్తల నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలగాలని గంభీర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: వచ్చే 15 నెలలు టీమిండియాకు చాలా కీలకం.. 11 ఏళ్ల ఆశ నెరవేరుతుందా?

కేకేఆర్‌కు మెంటార్‌గా గంభీర్
ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌)కు మెంటార్‌గా గంభీర్ వ్యవహరించనున్నాడు. అంతకుముందు రెండేళ్లు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. 2012, 2014 సీజ‌న్ల‌లో కోల్‌క‌తాకు గంభీర్ రెండు ఐపీఎల్ టైటిళ్లు అందించిన సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు