Team India : వచ్చే 15 నెలలు టీమిండియాకు చాలా కీలకం.. 11ఏళ్ల ఆశ నెరవేరుతుందా?

భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ టైటిల్ ను గెలుచుకుంది. ఆ తరువాత భారత్ జట్టు పది ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది.

Team India : వచ్చే 15 నెలలు టీమిండియాకు చాలా కీలకం.. 11ఏళ్ల ఆశ నెరవేరుతుందా?

Teamindia

ICC Tournaments : టీమిండియా విజయాలతో దూసుకెళ్తోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు పూర్తికాగా.. 3-1తో సిరీస్ ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. నాల్గో మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరుగుతుంది. ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ తరువాత టీమిండియా ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడనున్నారు. ఆ తరువాత టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది. ఇలా వరుసగా వచ్చే 15నెలలు భారత్ జట్టు మూడు పెద్ద ఐసీసీ టోర్నీల్లో పాల్గొనబోతుంది. దీంతో భారత్ జట్టుకు ఈ పదిహేను నెలలు చాలా కీలకమని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. గత 11ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్ జట్టు ఫైనల్స్ లో విజయం సాధించలేదు.

Also Raed : Yuvraj Singh : గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి యువరాజ్ పోటీ చేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది జూన్ 1 నుంచి జూన్ 29వ తేదీ వరకు వెస్టిండీస్, యూఎస్ దేశాలలో జరుగుతుంది. ఈ టోర్నీ నాకౌట్ తో సహా మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. మొత్తం 20 జట్లను ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ లో పాల్గోనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జైషా ధృవీకరించారు. టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. రెండో మ్యాచ్ జూన్ 9న పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది.

Also Read : హాసిని ఎక్కడుంటే అక్కడ సందడే.. జెలీనియా డాన్స్ వీడియో వైరల్

టీ20 ప్రపంచ కప్ తరువాత టీమిండియా వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చి నెలల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో పాల్గోనుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఈ టోర్నీని కచ్చితంగా పాకిస్థాన్ లోనే నిర్వహిస్తారా లేదా వేరే దేశానికి మారుస్తారా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీకోసం భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్తుందా లేదా అనేది ఆసక్తికర విషయంగా మారింది. ఆసియా కప్ 2023 తరహాలో ఛాంపియన్స్ ట్రోపీని కూడా హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించే అవకాశం ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ రెండుసార్లు గెలుచుకుంది. మరోవైపు 2025 జూన్ నెలలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ లోని లార్డ్స్ లో జరుగుతుంది. అయితే, భారత్ జట్టు మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

11ఏళ్లుగా భారత జట్టు ఏ ఐసీసీ టైటిల్ ను గెలుచుకోలేక పోయింది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ టైటిల్ ను గెలుచుకుంది. ఆ తరువాత భారత్ జట్టు పది ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది. ఆ సమయంలో భారత్ జట్టు ఐదు సార్లు ఫైనల్స్, నాలుగు సార్లు సెమీ ఫైనల్స్ వరకు చేరింది. 2021 టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది.