హాసిని ఎక్కడుంటే అక్కడ సందడే.. జెలీనియా డాన్స్ వీడియో వైరల్

బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా నటించిన జెలీనియా అదే పేరుతో తెలుగువారి మదిలో నిలిచిపోయింది.

హాసిని ఎక్కడుంటే అక్కడ సందడే.. జెలీనియా డాన్స్ వీడియో వైరల్

ccl 2024 genelia riteish deshmukh dance video viral

Genelia Deshmukh Dance: బొమ్మరిల్లు హాసిని గుర్తుందా? అదేనండి హా.. హా.. హాసిని. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా జెలీనియా తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయింది. చలాకీతనం, అమాయకత్వంతో కూడిన హసిని పాత్రలో చక్కగా ఒదిగిపోయి అందరినీ ఆకట్టుకుంది జెలీనియా. ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా తెలుగు ఆడియన్స్‌కు మాత్రం హాసినిగానే గుర్తుండిపోయింది. బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్‌ముఖ్‌ను మ్యారేజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది మన హాసిని.

తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రికెట్ గ్రౌండ్‌లో తన భర్తతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన వీడియోను జెలీనియా ఫ్యాన్స్ ట్విటర్‌లో షేర్ చేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) మ్యాచ్ ఆడుతున్న తన భర్తను ఎంకరేజ్ చేసేందుకు జెలీనియా డాన్స్ చేసింది. అది చూసి రితీశ్ కూడా తన భార్యతో పాటు పాదం కలిపాడు. జెలీనియా జోరు చూసి సీసీఎల్ ప్లేయర్లు కూడా డాన్స్ వేసేందుకు ఉత్సాహం చూపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

Also Read: జపాన్‌లో రష్మిక ఫాలోయింగ్ మాములుగా లేదుగా.. పోస్టర్స్‌తో ఫ్యాన్స్ సందడి..

జెలీనియా డాన్స్ వీడియో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మా హాసిని ఏం మారలేదని సంబరపడిపోతున్నారు. తెర మీదే కాదు నిజ జీవితంలోనూ తమను అలరిస్తోందని అంటున్నారు. జెలీనియా ఇలాగే హ్యపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.