Gautam Gambhir : యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తనకు దొరికిన ఓ చిన్న విరామాన్ని భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆస్వాదిస్తున్నాడు. అతడు తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (2025)లో ఓమ్యాచ్‌కు హాజరు అయ్యాడు. ఈ సమయంలో యాంకర్.. గంభీర్‌ను ఇంటర్వ్యూ చేసింది. రాపిడ్ పైర్ లో భాగంగా పలు ప్రశ్నలు అడిగింది.
భారత ఆటగాళ్లలో మెస్ట్ స్టైలిష్ ఆటగాడు ఎవరు అని అడుగగా.. శుభ్‌మన్ గిల్ అని గంభీర్ సమాధానం ఇచ్చాడు.
Asia Cup 2025 : యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025.. భారీ రికార్డు పై రషీద్ ఖాన్ కన్ను..
గంభీర్‌ను చెప్పిన సమాధానాలు ఇవే..
* క్లచ్ – సచిన్ టెండూల్కర్
* దేశీ బాయ్ – విరాట్ కోహ్లీ
* స్పీడ్ – జస్ప్రీత్ బుమ్రా
* గోల్డెన్ ఆర్మ్ – నితీష్ రాణా
* మోస్ట్ స్టైలిష్ – శుభ్‌మన్ గిల్
* మిస్టర్ కన్సిస్టెంట్ – రాహుల్ ద్రవిడ్
* రన్ మెషిన్ – వీవీఎస్ లక్ష్మణ్
* మోస్ట్ ఫన్నీ – రిషబ్ పంత్
* డెత్ ఓవర్ స్పెషలిస్ట్ – బుమ్రా గురించి చెప్పాలనుకున్నాను. కానీ నేను ఇప్పటికే అతని పేరును తీసుకున్నాను కాబట్టి జహీర్ ఖాన్ అని గంభీర్ తెలిపాడు.
Hardik Pandya : ఆసియాకప్ 2025లో హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించేనా? ఇంకో 6 వికెట్లు తీస్తే..
భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈమెగా టోర్నీలో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది.