Gautam Gambhir : ద్ర‌విడ్ కాంట్రాక్ట్ పొడిగింపు పై గంభీర్‌.. ‘టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ద‌గ్గ‌ర ప‌డుతున్న ఈ స‌మ‌యంలో..’

Gautam Gambhir-Rahul Dravid : కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కాంట్రాక్ట్ ముగిసిన‌ప్ప‌టికీ అత‌డిపై విశ్వాసం ఉంచిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అత‌డి ప‌దవి కాలాన్ని పొడిగించింది.

Gautam Gambhir-Rahul Dravid

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచులో ఓడిన‌ప్ప‌టికీ టీమ్ఇండియా ప్ర‌ద‌ర్శ‌న అద్భుత‌మ‌నే చెప్పాలి. వ‌రుస‌గా 10 మ్యాచుల్లో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కాంట్రాక్ట్ ముగిసిన‌ప్ప‌టికీ అత‌డిపై విశ్వాసం ఉంచిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అత‌డి ప‌దవి కాలాన్ని పొడిగించింది. ద్ర‌విడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాఠోడ్‌, బౌలింగ్ కోచ్ ప‌రాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ల ప‌ద‌వి కాలాన్ని కూడా పొడిగించారు. కాగా.. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యం పై భార‌త మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గౌంభీర్ స్పందించాడు.

ద్ర‌విడ్ కాంట్రాక్ట్ పొడిగింపు నిర్ణ‌యాన్ని గౌత‌మ్ గంభీర్ స్వాగ‌తించాడు. మ‌రో ఏడు నెల‌ల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 జ‌ర‌గ‌నున్న ఇలాంటి స‌మ‌యంలో కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని కొన‌సాగించాల‌నుకోవ‌డం చాలా మంచి నిర్ణ‌యం అని అన్నాడు. కోచ్‌గా కొన‌సాగేందుకు ద్ర‌విడ్ అంగీక‌రించ‌డం కూడా అభినంద‌నీయం అని చెప్పాడు. టీమ్ఇండియా అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌ను కొన‌సాగిస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపాడు. అయితే.. టీ20 ఫార్మాట్ చాలా భిన్న‌మైంద‌ని, స‌వాళ్లు ఉంటాయ‌న్నాడు. ఈ స‌వాళ్ల‌ను ద్ర‌విడ్ స‌హా అత‌డి బృందం ఎదుర్కొని మంచి ఫ‌లితాల‌ను సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు.

Ashwin : న‌వంబ‌ర్ 19 చేదు జాప్ఞ‌కాలు గుర్తు చేసుకున్న అశ్విన్‌.. ఎలా చెప్పేది..!

ర‌విశాస్త్రి స్థానంలో..

2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా నిరాశ‌ప‌ర‌చ‌డంతో ర‌విశాస్త్రి స్థానంలో రెండు సంవ‌త్స‌రాల కాల ప‌రిమితితో రాహుల్ ద్ర‌విడ్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఆ స‌మ‌యంలో నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ చీఫ్ ఉన్న ద్ర‌విడ్‌ను మాజీ కెప్టెన్‌, అప్ప‌టి బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఒప్పించి కోచింగ్ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. ద్ర‌విడ్ మార్గ‌నిర్దేశంలో టీమ్ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించింది.

వ‌న్డేలు, టెస్టులు, టీ20ల్లో నంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా నిలిచింది. అయితే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 సెమీస్‌, డ‌బ్ల్యూటీసీ 2023 పైన‌ల్‌, వ‌న్డే ప్ర‌పంచ‌కప్ 2023 ఫైన‌ల్ మ్యాచుల్లో ఓడిపోయింది. కాగా ఆసియా క‌ప్ 2023ని మాత్రం సొంతం చేసుకుంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచుతో ద్ర‌విడ్ ప‌ద‌వికాలం ముగిసింది. కోచ్‌గా వైదొల‌గాల‌ని ద్ర‌విడ్ భావించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. బీసీసీఐ మాత్రం ద్ర‌విడ్‌ను ఒప్పించింది. హెడ్ కోచ్‌గా కొన‌సాగేలా చేసింది.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ను ఒప్పించే ప‌నిలో బీసీసీఐ..! ఊ అంటాడా.. ఊహూ అంటాడా.. అదే జ‌రిగితే..!

ట్రెండింగ్ వార్తలు