Ashwin : న‌వంబ‌ర్ 19 చేదు జాప్ఞ‌కాలు గుర్తు చేసుకున్న అశ్విన్‌.. ఎలా చెప్పేది..!

Ravichandran Ashwin : న‌వంబ‌ర్ 19 ని భార‌త క్రికెట్ అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు.

Ashwin : న‌వంబ‌ర్ 19 చేదు జాప్ఞ‌కాలు గుర్తు చేసుకున్న అశ్విన్‌.. ఎలా చెప్పేది..!

Ravichandran Ashwin

న‌వంబ‌ర్ 19 ని భార‌త క్రికెట్ అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్ ఆరోజే జ‌రిగింది. నాటి మ్యాచులో భార‌త జ‌ట్టు ఓట‌మి చ‌విచూసింది. ఆ మెగాటోర్నీలో వ‌రుస‌గా 10 మ్యాచుల్లో గెలిచిన టీమ్ఇండియా ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. దీంతో ప‌న్నెండు ఏళ్ల త‌రువాత ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడాల‌ని భావించిన జ‌ట్టుకు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఫైన‌ల్ మ్యాచులో ఓట‌మి త‌రువాత టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావ‌ర‌ణాన్ని తాజాగా ర‌విచంద్ర‌న్ వివ‌రించాడు.

ఓట‌మి త‌రువాత కెప్టెన్ రోహిత్ శ‌ర్మతో పాటు సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఏడుస్తూనే ఉన్నార‌ని నాటి చేదు జ్ఞాప‌కాల‌ను మ‌రోసారి గుర్తు చేసుకున్నాడు అశ్విన్. ఆ ఇద్ద‌రిని అలా చూడ‌డం మిగిలిన వారికి ఎంతో బాధ‌ను క‌లిగించింద‌న్నాడు. అలా జ‌ర‌గ‌కుండా ఉండాల్సింద‌న్నాడు. ఎంతో అనుభ‌వం, నైపుణ్యం ఉన్న జ‌ట్టు మ‌న‌ది. ఖ‌చ్చితంగా క‌ప్పును ముద్దాడుతామ‌ని భావించిన‌ట్లు చెప్పాడు. ఇద్ద‌రు స‌హ‌జ సిద్ద‌మైన నాయ‌కులు అని చెప్పాడు. ఆ ఇద్ద‌రూ కూడా ఆట‌గాళ్ల‌కు కావాల్సిన స్వేచ్చ‌ను ఇచ్చి వాళ్లు మ‌రింత మెరుగ్గా రాణించేలా కృషి చేశార‌న్నాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ను ఒప్పించే ప‌నిలో బీసీసీఐ..! ఊ అంటాడా.. ఊహూ అంటాడా.. అదే జ‌రిగితే..!

రోహిత్ కెప్టెన్సీ అద్భుతం..

రోహిత్ శ‌ర్మ గొప్ప కెప్టెన్ అని అశ్విన్ మెచ్చుకున్నాడు. జ‌ట్టులోని ప్ర‌తీ వ్య‌క్తిని అర్థం చేసుకుంటాడ‌న్నాడు. ఎవ‌రికి ఏమీ ఇష్ట‌మో, ఏవీ ఇష్టం లేదో అత‌డికి తెలుసు. అలాగే ప్ర‌తి ఒక్క ఆట‌గాడి నైపుణ్యాల గురించి రోహిత్‌కు చ‌క్క‌టి అవ‌గాహ‌న ఉంద‌న్నాడు. ఎవ‌రిని ఎప్పుడు ఎలా ఉప‌యోగించుకోవాలో అత‌డికి బాగా తెలుసున‌ని చెప్పాడు. అయితే.. కొన్నిసార్లు ఇలాంటివి ఎదుర్కొన‌క త‌ప్ప‌ద‌న్నాడు.

ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్‌ప‌టేల్ గాయ‌ప‌డ‌డంతో ఆఖరి నిమిషంలో ర‌విచంద్ర‌న్ అశ్విన్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. అయితే.. ఆస్ట్రేలియాతో జ‌రిగిన మొద‌టి మ్యాచులో మాత్ర‌మే అత‌డు ఆడాడు. మిగిలిన మ్యాచుల్లో తుది జ‌ట్టులో అత‌డికి చోటు ద‌క్క‌లేదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 11 మ్యాచ్‌ల్లో 54.27 సగటుతో 597 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మెగాటోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా రోహిత్ నిలిచాడు.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే.. జాబితాను ప్ర‌క‌టించిన ఐసీసీ