Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ను ఒప్పించే ప‌నిలో బీసీసీఐ..! ఊ అంటాడా.. ఊహూ అంటాడా.. అదే జ‌రిగితే..!

Rohit Sharma-BCCI : హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌కు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని బీసీసీఐ భావిస్తోంద‌ట‌. ఈ మేర‌కు రోహిత్‌ను ఒప్పించేందుకు త‌మ శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ను ఒప్పించే ప‌నిలో బీసీసీఐ..! ఊ అంటాడా.. ఊహూ అంటాడా.. అదే జ‌రిగితే..!

BCCI Trying To Convince Rohit Sharma

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023ను టీమ్ఇండియా తృటిలో కోల్పోయింది. వ‌రుస‌గా 10 మ్యాచుల్లో గెలిచిన భార‌త్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 పై ప‌డింది. మ‌రో ఏడు నెల‌లు మాత్ర‌మే ఈ మెగా టోర్నీకి స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌ట్టు కూర్పు ఎలా ఉంటుంది, ఎవ‌రి నాయ‌క‌త్వంలో టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది వంటి అంశాలు ఆసక్తిని క‌లిగిస్తున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ మెగాటోర్నీకి సంబంధించిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉంది.

ఈ క్ర‌మంలో గురువారం ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టును ఎంపిక చేయ‌నుంది. అయితే.. హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌కు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని బీసీసీఐ భావిస్తోంద‌ట‌. ఈ మేర‌కు రోహిత్‌ను ఒప్పించేందుకు త‌మ శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022లో భార‌త జ‌ట్టు సెమీఫైన‌ల్ మ్యాచులో ఓడిపోయిన త‌రువాత నుంచి ఈ ఫార్మాట్‌లో టీమ్ఇండియా త‌రుపున రోహిత్ శ‌ర్మ ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. అప్ప‌టి నుంచి అత‌డు పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు.

Bowler Bizarre Action : విచిత్ర‌మైన బౌలింగ్ యాక్ష‌న్‌.. అయోమ‌యంలో బ్యాట‌ర్‌.. ఎక్క‌డ ఉన్నావ్ బాసూ..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు రూట్‌మ్యాప్‌..!

బీసీసీఐ కార్యదర్శి, సెలెక్షన్ కమిటీ కన్వీనర్ జై షా, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌తో గురువారం సమావేశం కానున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు జ‌ట్ల ఎంపిక గురించి చ‌ర్చించ‌డంతో పాటు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు రూట్ మ్యాప్‌ను త‌యారు చేయ‌నున్నారు.

టీ20ల్లో రెగ్యుల‌ర్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్య గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌రో నెల రోజుల పాటు అత‌డు ఆడే అవ‌కాశాలు లేవు. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో టీ20 కెప్టెన్‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారు అన్న సంగ‌తి ఆస‌క్తిక‌రంగా మారింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు సూర్య‌కుమార్ యాద‌వ్‌ను కెప్టెన్‌గా నియ‌మించ‌డంతో మ‌రోసారి అత‌డికే కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా..? లేదంటే రోహిత్ శ‌ర్మ‌ను ఒప్పిస్తారా అన్న‌ది చూడాల్సిందే.

ఇదిలాఉంటే.. టీ20ల్లో ఆడాల‌ని అనుకోవ‌డం లేద‌ని గ‌తంలోనే రోహిత్ శ‌ర్మ చెప్పాడు. అయితే.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియాను రోహిత్ శ‌ర్మ‌ ఏ విధంగా న‌డిపాడో చూసిన త‌రువాత టీ20ల్లోనూ అత‌డి సార‌థ్యంలోనే భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగాల‌ని చాలా మంది సూచిస్తున్నారు. అయితే.. గాయం నుంచి కోలుకున్న త‌రువాత హార్దిక్ పాండ్య జ‌ట్టులోకి వ‌స్తే ప‌రిస్థితి ఏంటి..? అన్న ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే.. జాబితాను ప్ర‌క‌టించిన ఐసీసీ

ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వం వ‌హిస్తే మాత్రం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అత‌డి సార‌థ్యంలోనే టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. రోహిత్ కాదంటే మాత్రం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ ను కెప్టెన్‌గా నియ‌మించే అవ‌కాశం ఉంది.

దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భారత్ జ‌ట్టు 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. టీ20 సిరీస్‌తో పాటు టెస్టు, వ‌న్డే జ‌ట్ట‌ను సైతం సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించ‌నున్నారు.