Gautam Gambhir Raises Questions On Sanju Samsons Mindset
Gautam Gambhir: ఐపీఎల్‌లో ఆరంభంలో అదరగొట్టి.. తర్వాత ఢీలాపడ్డ ఆటగాళ్లలో మొదట నిలిచే పేరు సంజూ శాంసన్.. ఈ మాట అంటున్నది.. మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్. సంజూ శాంసన్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టుకు కెప్టెన్ అయ్యారు. అయితే రాజస్థాన్ ఈ ఏడాది అంత ప్రభావం చూపించట్లేదు. ఈ ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్‌లో సెంచెరీ కొట్టి ఘనంగా ఆరంభించిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్.. గత సీజన్‌లో మాదిరిగానే.. నిలకడ లేని ఆటతీరుతో ఇబ్బంది పడుతున్నట్లుగాబ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.
ఈ సీజన్ మెరుగ్గా ఆరంభించి, ఆ తర్వాత మ్యాచ్‌ల్లో వరుసగా విఫలం అయ్యారని, గతేడాది ఐపీఎల్ నుంచి శాంసన్ ప్రదర్శన చూస్తుంటే.. ఆరంభం అదిరిపోతుంది కానీ, తర్వాత నిలకడ ఉండట్లేదు అని అన్నారు. ఒకసారి నీ గ్రాఫ్ నువ్వే చూసుకోవాలని, ఇంత దారుణంగా ఉండకూడదని సూచించారు. ఒక మంచి ప్లేయర్ గ్రాఫ్ అనేది నిలకడగా ఉండాలని అన్నారు.
శాంసన్.. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో సెంచెరీ చేయగా.., తర్వాత మూడు మ్యాచ్‌లలో వరుసగా.. 4, 1 మరియూ 21పరుగులు మాత్రమే చేశాడని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, డివిలియర్స్‌ల గ్రాఫ్ చూస్తే.. ఒక మ్యాచ్‌లో 80 పరుగులు చేసి తర్వాత 0,1,10లు నమోదు చేయట్లేదని, కనీసం 30 నుంచి 40 పరుగులు చేసి అవుట్ అవుతుంటారని, వారిని చూసి శాంసన్ నేర్చుకోవల్సిన అవసరం ఉందన్నారు.
ఇంతలా గ్రాఫ్ పడిపోవడానికి శాంసన్ మైండ్ సెట్ కూడా సమస్యేనని, శాంసన్.. పరిస్థితుల్ని బట్టి నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉండాలని హితవు పలికారు. ఎన్నో సందర్భాల్లో శాంసన్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్.. ఈ సీజన్‌లో ప్రదర్శనల తర్వాత మాత్రం విమర్శలు ఎక్కుపెట్టడం గమనార్హం.