Liam Livingstone : వావ్.. ఏం కొట్టావ్ భయ్యా.. లివింగ్‌స్టోన్ ఊచకోత.. సిక్సర్లతో దద్దరిల్లిన మైదానం.. వీడియో వైరల్
Liam Livingstone : ఇంగ్లాండ్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ అదరగొట్టాడు.

Liam Livingstone
Liam Livingstone : ఇంగ్లాండ్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ అదరగొట్టాడు. అద్భుత బ్యాటింగ్, బౌలింగ్‌తో లంకాషైర్ లైట్నింగ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
వైటాలిటీ బ్లాస్ట్ 2025 టోర్నీలో భాగంగా క్వార్టర్ ఫైనల్లో లంకాషైర్ లైట్నింగ్ వర్సెస్ కెంట్ స్పిట్‌ఫైర్స్ జట్ల మధ్య ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో మ్యాచ్ జరిగింది. కెంట్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. జో డెన్లీ (28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లాంకషైర్ జట్టు ఫాస్ట్ బౌలర్ ల్యూక్ వుడ్ 29పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లివింగ్ స్టోన్ నాలుగు ఓవర్లు స్పిన్ బౌలింగ్‌వేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత 154 పరుగుల లక్ష్యంతో లంకాషైర్ లైట్నింగ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. బౌలింగ్ లో అదరగొట్టిన లివింగ్ స్టోన్.. బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. అద్భుత బ్యాటింగ్‌తో బౌండరీల మోత మోగించాడు.
– T20 Blast.
– Quarter Final.
– 85*(45) with bat.
– 2/21 with ball.
– Player of the match.ITS LIAM LIVINGSTONE SHOW, THE BIG MATCH PLAYER. 💪🔥 pic.twitter.com/R0ag5hQgQe
— Johns. (@CricCrazyJohns) September 6, 2025
లియామ్ లివింగ్ స్టోన్ కేవలం 45 బంతుల్లోనే 85 (నాటౌట్) పరుగులు చేశాడు ఇందులో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. లివింగ్ స్టోన్ అద్భుత బ్యాటింగ్ తో లంకాషైర్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్స్ మ్యాచ్ కు అర్హత సాధించింది. ఈనెల 13న వైటాలిటీ బ్లాస్ట్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
మ్యాచ్ స్కోర్ వివరాలు
లంకాషైర్ 156/7 (18.3 ఓవర్లు)
కెంట్ 153/10 (20 ఓవర్లు)
లంకాషైర్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది.
Special. @liaml4893 🤩
⚡️ #StrikeTogether pic.twitter.com/Q1DkgUJC1g
— Lancashire Cricket (@lancscricket) September 6, 2025