Bomb Blast Cricket Stadium: క్రికెట్ గ్రౌండ్‌లో పేలిన బాంబు.. పరుగులు పెట్టిన ప్లేయర్లు.. ఒకరు మృతి.. వీడియో వైరల్

క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. (Bomb Blast Cricket Stadium)

Bomb Blast Cricket Stadium: క్రికెట్ గ్రౌండ్‌లో పేలిన బాంబు.. పరుగులు పెట్టిన ప్లేయర్లు.. ఒకరు మృతి.. వీడియో వైరల్

Bomb Blast Cricket Stadium

Updated On : September 7, 2025 / 7:05 AM IST

Bomb Blast Cricket Stadium: పాకిస్థాన్ దేశంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో జరిగింది. క్రికెట్ మైదానంలో పేలుడు తరువాత చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఊహించని పరిణామంతో క్రికెట్ ప్లేయర్లు, వీక్షకులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Rohit Sharma : అభిమానుల పై రోహిత్ శ‌ర్మ అస‌హ‌నం.. వినాయ‌కుడి ముందు.. నా పేరు ఎందుకు?

బజౌర్ జిల్లాలోని ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ మైదానంలో ఈ బాంబు పేలుడు ఘటన జరిగింది. పేలుడు తరువాత ఆటగాళ్లు అక్కడి నుంచి పరుగెత్తుతూ కనిపించారు. వారం క్రితం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓ పోలీస్ స్టేషన్ పై క్వాడ్‌కాప్టర్ సహాయంతో దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక పౌరుడు గాయపడ్డాడు.


ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం ద్వారా ఈ దాడికి పాల్పడినట్లు బజౌర్ జిల్లా పోలీసు అధికారి వకాస్ రఫీక్ తెలిపారు. ఈ దాడిలో ఒకరు మరణించగా.. కొంతమంది చిన్నారులు కూడా గాయపడినట్లు, వారు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

అయితే, కొన్నివారాల క్రితం భద్రతాదళాలు ప్రారంభించిన ఉగ్రవాద వ్యతిరేక చర్యకు సంబంధించిన ఆపరేషన్ సర్బకాఫ్‌కు ప్రతిస్పందనగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లుగా భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు.