Gill can grow captain with Rohit Virat in dressing room Axar Patel
Shubman Gill – Axar Patel : శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా మెరుగ్గా రాణించేందుకు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఒక చక్కని అవకాశం అని టీమ్ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తెలిపాడు. సీనియర్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం తప్పకుండా అతడికి కలిసి వస్తుందన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డే ముందు మీడియాతో మాట్లాడుతూ అక్షర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు బీసీసీఐ సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి శుభ్‌మన్ గిల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కలిసి గిల్ ఎలా సమన్వయం చేసుకుని జట్టును నడిపిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లాగా ఇప్పుడు ఆసీస్‌తో వన్డే సిరీస్ కూడా సారథిగా గిల్ నిరూపించుకునేందుకు చక్కని అవకాశం అవుతుందని భావిస్తున్నాని అక్షర్ పటేల్ తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యతలను తీసుకునేటప్పుడు అతడు ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదన్నాడు. గిల్‌లో ఉన్న మంచి లక్ష్యమే ఇది అని చెప్పుకొచ్చాడు.
తాను ఇతరుల సారథ్యంలోనూ ఆడినట్లుగా చెప్పాడు. ప్రస్తుతం పరివర్తన కాలం నడుస్తుందని, సీనియర్లు, జూనియర్లు కలిసి ఆడుతన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తమ అనుభవాలను సీనియర్లు జూనియర్లతో పంచుకుంటున్నామన్నాడు. ఐపీఎల్‌లో ఆడిన అనుభం కూడా వారికి కలిసి వస్తుందన్నాడు.
IND vs SA : భారత పర్యటనకు దక్షిణాఫ్రికా-ఏ టీమ్ ఇదే.. బవుమాకు చోటు.. కెప్టెన్ ఎవరంటే..?
అప్పుడు ధోని..
ఎంఎస్ ధోని కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు జట్టులో ఉన్నారని, వారిద్దరు కూడా ధోని నాయకత్వంలో సుమారు ఐదేళ్లు ఆడారన్నాడు. ఇప్పుడు గిల్ సైతం సీనియర్లు కోహ్లీ, రోహిత్ ఉన్నప్పుడే బాధ్యతలను అందుకున్నాడని, వారిద్దరి సూచనలు గిల్‌కు ఎంతో తోడ్పాటు అందిస్తాయని చెప్పాడు.