Glenn Maxwell complete 150 sixes in Big Bash
BBL: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ బిగ్‌బాష్ లీగ్ 2025-26 ఎడిషన్‌లో అదరగొడుతున్నాడు. మెల్‌బోర్న్ స్టార్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుడి చేతి వాటం బ్యాటర్ ఆదివారం సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును గెలిపించాడు.
ఈ క్రమంలో అతడు బిగ్‌బాష్ లీగ్‌లో (BBL) 150 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. మాక్స్‌వెల్ కన్నా ముందు క్రిస్ లిన్ మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నాడు.
బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
* క్రిస్ లిన్ – 220 సిక్సర్లు
* మాక్స్‌వెల్ – 151 సిక్సర్లు
* బెన్ మెక్‌డెర్మాట్ – 140 సిక్సర్లు
* ఆరోన్ ఫించ్ – 118 సిక్సర్లు
* మార్కస్ స్టోయినిస్ – 111 సిక్సర్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. సిడ్నీ బ్యాటర్లలో షాదాబ్ ఖాన్ (25), మాథ్యూ గిల్క్స్ (24) లు పర్వాలేదనిపించారు. మెల్‌బోర్న్ బౌలర్లలో హరీస్ రౌఫ్ మూడు వికెట్లు తీశాడు. టామ్ కర్రన్, స్టోయినిస్, మిచెల్ స్వెప్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
BCCI : టెస్టుల్లో గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్.. స్పందించిన బీసీసీఐ..
104 METRES 😳
Glenn Maxwell hits the ball on the roof to bring up his 150th Big Bash SIX! #BBL15 pic.twitter.com/XoDdmKAJTV
— KFC Big Bash League (@BBL) December 28, 2025
అనంతరం జో క్లార్క్ (60; 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీ బాదగా గ్లెన్ మాక్స్ వెల్ (39 నాటౌట్; 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడడంతో 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మెల్‌బోర్న్ స్టార్స్ 14 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి అందుకుంది.