Smriti Mandhana : మొన్న పెళ్లి రద్దు.. నేడు చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. మహిళల క్రికెట్‌లో ఏకైక ప్లేయర్
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana ) అరుదైన ఘనత సాధించింది.
Smriti Mandhana scripts history became the fastest woman cricketer to reach 10000 international runs
Smriti Mandhana : టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. ఆదివారం తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 27 పరుగుల వద్ద స్మృతి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె టీమ్ఇండియా దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను అధిగమించింది.
291 ఇన్నింగ్స్‌ల్లో మిథాలీ రాజ్ 10 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా మంధాన 281 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకుంది. ఇదిలా ఉంటే.. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో ప్లేయర్‌గా స్మృతి మంధాన రికార్డులకు ఎక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో మంధాన 48 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది.
BCCI : టెస్టుల్లో గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్.. స్పందించిన బీసీసీఐ..
మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల ఫ్లస్ పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* మిథాలీ రాజ్ (భారత్) – 10868 పరుగులు
* సూజీ బేట్స్ (న్యూజిలాండ్‌కు ) – 10652 పరుగులు
* చార్లోట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) – 10273 పరుగులు
* స్మృతి మంధాన (భారత్) – 10053 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (80; 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు), షెఫాలీ వర్మ (79; 46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకాలు బాదారు. రిచా ఘోష్ (40; 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా పరుగులు చేసింది.
ILT20 : పొలార్డ్ ఊచకోత.. ప్లే ఆఫ్స్‌కు ముంబై ..
Mt. 1⃣0⃣,0⃣0⃣0⃣🏔️
Congratulations to #TeamIndia vice-captain Smriti Mandhana on a landmark milestone 👏👏
Updates ▶️ https://t.co/9lrjb3dMqU #INDvSL | @mandhana_smriti | @IDFCFIRSTBank pic.twitter.com/bkqF2HwuDO
— BCCI Women (@BCCIWomen) December 28, 2025
అనంతరం 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. లంక బ్యాటర్లలో చమరి ఆటపట్టు (52; 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీ చరణి ఓ వికెట్ సాధించింది.
