Glenn Maxwell : ఈ షాట్‌ను ఏమని అనాలో..! బీబీఎల్‌లో వినూత్న షాట్ ఆడిన మాక్స్‌వెల్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ దుమ్ములేపుతున్నాడు.

Glenn Maxwell hits outrageous ramp shot
Glenn Maxwell hits outrageous ramp : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ దుమ్ములేపుతున్నాడు. మెల్‌బోర్న్ స్టార్స్ తరుపున ఆడుతున్న మాక్స్‌వెల్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచులో మాక్స్‌వెల్ ఓ వినూత్న షాట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూప్, రివర్స్ కలగలిపి మాక్సీ బంతిని బౌండరీకి తరలించాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ షాట్‌ను ఏమని పిలవాలని కామెంట్లు చేస్తున్నారు.
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మంగళవారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచును 14 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.
First Hat trick : క్రికెట్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ తీసింది ఈరోజే.. ఆ బౌలర్ ఎవరో మీకు తెలుసా..?
రెనెగేడ్స్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (23), హార్వే (18) లు రాణించారు. స్టార్స్ బౌలర్లలో డేనియల్ లారెన్స్ రెండు వికెట్లు తీశాడు. వెబ్‌స్టర్, స్టెకెటీ, మాక్స్‌వెల్, ఇమాద్ వసీం, జోయెల్ పారిస్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం మాక్స్‌వెల్ (32 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో మెల్‌బోర్న్ స్టార్స్ లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగా కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మాక్సీతో పాటు థామస్ రోజర్స్ (46నాటౌట్; 34 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, పీటర్ సిడిల్ లు చెరో వికెట్ సాధించారు. మాక్సీ సారథ్యంలోని మెల్‌బోర్న్ స్టార్స్‌కు ఇది వరుసగా నాలుగో గెలుపు.
Sledging : ఈ యువ కెప్టెన్ మాటలు విన్నారా..? చిన్నోడే గానీ మహాముదురు..!
Glenn Maxwell inventing new shots in cricket.
– The Mad Maxi. ??pic.twitter.com/lTZcdWCA1n
— Johns. (@CricCrazyJohns) January 2, 2024