×
Ad

Virat Kohli Rohit Sharma: కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ఎగిరి గంతేసే వార్త..! మళ్లీ మైదానంలోకి..! ఎప్పుడంటే..

ఎవరూ ఊహించని రీతిలో, ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇస్తూ ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Virat Kohli Rohit Sharma: భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తమ అభిమాన ప్లేయర్ల రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. విరాట్, రోహిత్ తిరిగి మైదానంలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ కోసం అక్టోబర్ 4న స్క్వాడ్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఫిట్‌నెస్ టెస్టులోనూ పాసైన ఈ ఇద్దరు స్క్వాడ్‌లో ఉండడం ఖాయమని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేదు విరాట్, రోహిత్.

భారత జట్టు అక్టోబర్‌లోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. సిరీస్‌కు సమయం దగ్గరపడడంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు వన్డే, టీ20 స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్, రోహిత్ లను ఈ సిరీస్‌కు ఎంపిక చేయడం పక్కా అని తెలుస్తోంది.

వన్డేలకు మాత్రమే పరిమితం..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి గ్రౌండ్ లోకి ఎప్పుడు అడుగు పెడతారా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరు క్రికెటర్లు కేవలం వన్డే లకే పరిమితం అయ్యారు. జూన్ మొదటి వారంలో ముగిసిన IPL 2025 తర్వాత వారు గేమ్ ఆడింది. మార్చి ప్రారంభంలో జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో వారు చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత దాదాపు 8 నెలల కాలానికి ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తిరిగి గ్రౌండ్ లోకి అడుగు పెట్టనున్నారు.

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే వన్డే జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కుతుందని నివేదికలు చెబుతున్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. విరాట్, రోహిత్ ఇద్దరూ ఇప్పుడు వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. 2024 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వారు T20I క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ICC ఈవెంట్‌లో రోహిత్ భారత్ కి నాయకత్వం వహించాడు.

మే నెలలో రోహిత్, విరాట్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వారు ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ మే 7న టెస్ట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్ నుండి తనను తాను తొలగించుకున్న రోహిత్.. జట్టుకు నాయకత్వం వహిస్తానని ధృవీకరించాడు. కానీ జట్టు ఎంపికకు కొన్ని వారాల ముందు అతను తన మనసు మార్చుకున్నాడు.

రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులకే విరాట్ కోహ్లీ సైతం షాక్ ఇచ్చాడు. రిటైర్ మెంట్ ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగుల మార్కుకు కేవలం 770 పరుగుల దూరంలో ఉన్నాడు విరాట్. ఇలాంటి తరుణంలో ఇంత పెద్ద నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసిందని చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ గెలిచాక టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు విరాట్, రోహిత్. ఇక ఇంగ్లండ్ పర్యటనకు ముందే టెస్టులకూ గుడ్ బై చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడే అవకాశం ఉంది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19న పెర్త్‌లో తొలి వన్డే జరగనుంది. అక్టోబర్ 23న అడిలైడ్ లో రెండో వన్డే, అక్టోబర్ 25న సిడ్నీలో మూడో వన్డే ఉంటాయి. వన్డే సిరీస్ అవగానే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ ఉంటుంది.

Also Read: టెస్టుల్లో తొలి సెంచ‌రీ చేసిన ధ్రువ్ జురెల్‌.. భార‌త వికెట్ కీప‌ర్ల‌లో ఇలా ఐదోవాడు తెలుసా..