Dhruv Jurel : టెస్టుల్లో తొలి సెంచ‌రీ చేసిన ధ్రువ్ జురెల్‌.. భార‌త వికెట్ కీప‌ర్ల‌లో ఇలా ఐదోవాడు తెలుసా..

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) టెస్టుల్లో తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు.

Dhruv Jurel : టెస్టుల్లో తొలి సెంచ‌రీ చేసిన ధ్రువ్ జురెల్‌..  భార‌త వికెట్ కీప‌ర్ల‌లో ఇలా ఐదోవాడు తెలుసా..

IND vs WI 1st test Dhruv Jurel 12th Indian wicketkeeper to score a Test century

Updated On : October 3, 2025 / 4:26 PM IST

Dhruv Jurel : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్ టెస్టుల్లో త‌న తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. వెస్టిండీస్‌తో అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోస్ట‌న్ ఛేజ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. 190 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో జురెల్ (Dhruv Jurel) సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి మూడు అంకెల స్కోరు అందుకున్నాడు.

ఈ క్ర‌మంలో అత‌డు టెస్టుల్లో టీమ్ఇండియా త‌రుపున సెంచ‌రీ చేసిన 12వ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా నిలిచాడు. వీరిలో విజయ్ మంజ్రేకర్, ఫరూక్ ఇంజనీర్, అజయ్ రాత్రా, వృద్ధిమాన్ సాహాల‌తో పాటు ధ్రువ్ జురెల్ కూడా త‌మ తొలి టెస్టు సెంచ‌రీని వెస్టిండీస్ పైనే చేయ‌డం విశేషం.

Chappell Hadlee Trophy : ఆస్ట్రేలియాకు వ‌రుణుడి సాయం.. చాపెల్-హాడ్లీ ట్రోఫీని నిలబెట్టుకుంది

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆ త‌రువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ 119 ఓవ‌ర్లు ముగిసే స‌రికి నాలుగు వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (105), ర‌వీంద్ర జ‌డేజా (86)లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 237 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.