శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గా గుణవర్దనె
శ్రీలంక నేషనల్ టీమ్ బ్యాటింగ్ కోచ్ గా అవిష్క గుణవర్దనె ఎంపికయ్యాడు. శ్రీలంక టీమ్-ఏ కోచ్ గా నియమిస్తూ లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.
శ్రీలంక నేషనల్ టీమ్ బ్యాటింగ్ కోచ్ గా అవిష్క గుణవర్దనె ఎంపికయ్యాడు. శ్రీలంక టీమ్-ఏ కోచ్ గా నియమిస్తూ లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.
శ్రీలంక నేషనల్ టీమ్ బ్యాటింగ్ కోచ్ గా అవిష్క గుణవర్దనె ఎంపికయ్యాడు. శ్రీలంక టీమ్-ఏ కోచ్ గా నియమిస్తూ లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ప్రస్తుత లంక బ్యాటింగ్ కోచ్ జాన్ లెవిస్ కుటుంబం విషయమై లీవ్ లో ఉండటంతో అతని స్థానంలో తాత్కాలిక బ్యాటింగ్ కోచ్ గా గుణవర్దనెను లంక బోర్డు నియమించింది. దీంతో వెంటనే గుణవర్దనే బుధవారం రాత్రి (జనవరి 30, 2019) ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. కెన్ బెర్రాలో ఆస్ట్రేలియాతో లంక టీమ్-ఏ జట్టు రెండో టెస్టు మ్యాచ్ ముగిసే వరకు జట్టుతో అక్కడే ఉండనున్నాడు. గుణవర్దనె.. శ్రీలంక మాజీ ఓపెనర్ బ్యాట్స్ మన్. తన కెరీర్ లో 6 టెస్టులు 61 వన్డేలు ఆడాడు.
2016 మే నెలలో లంక టీమ్-ఏకు బ్యాటింగ్ కోచ్ గా అపాయింట్ అయ్యాడు. 2017లో నేషనల్ టీమ్ బ్యాటింగ్ కోచ్ గా కూడా గుణవర్దనె సేవలు అందించాడు. ఆస్ట్రేలియాలో శ్రీలంక జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. జట్టులో ఒకరితరువాత ఫాస్ట్ బౌలర్లు గాయాలతో ఆటకు దూరం కావడంతో తొలి టెస్టులో ఘోరంగా ఓడిపింది. పర్యటన మొదలైనప్పటి నుంచి కోచ్ చందిక హథ్రుసింఘా కూడా మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కొత్త బ్యాటింగ్ కోచ్ సమస్య కూడా తోడు కావడంతో లంక జట్టు మరింత ఒత్తిడికి లోనవుతోంది. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు కెన్ బెర్రాలోని మనూక ఓవల్ వేదికగా ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది.
