టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే టాప్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా ఎదిగాడు. క్రేజ్‌ను వాడుకుంటున్న కోహ్లీ వరుసగా యాడ్‌లతో భారీగా దండుకుంటున్నాడు. ఎడ్వర్టైజ్‌మెంట్స్‌తో పాటు సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా కూడా సొమ్ము చేసుకుంటున్నాడు.
ఇటీవల ఓ పోస్టు పెట్టిన కోహ్లీ.. ‘నేర్చుకోవాలి. ఎదగాలి అనుకుంటే ప్రతిరోజు ఓ అవకాశమే. గొప్పగా ఉందాం’ అని విరాట్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. దానిపై సెటైర్ వేయాలని భావించిన హర్భజన్ సింగ్.. ‘నీకు ప్రతిరోజూ మరింతగా డబ్బు సంపాదించుకునే అవకాశమేనంటూ కామెంట్ చేశాడు.
అంతే భజ్జీ.. విరాట్ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిపోయాడు. నీకంత అసూయ ఎందుకని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు లాసర్ అంటూ ఘాటుగానే బదులిచ్చారు. సంపాదించాలంటే నేర్చుకోవడం, ఎదగడం ఎలాగో ముందు నువ్వు నేర్చుకోవాలని మరొకరు కామెంట్ చేశారు. కోహ్లీ అందులో హంబుల్ అని కూడా యాడ్ చేశాడు. అది నీకు తెలియదని ఒకరు అంటుండగా, భజ్జీకి ఎక్కడో కాలుతుందని ఇంకో కామెంట్ వచ్చింది.