అనంత్ అంబానీ పెళ్లిలో బాలీవుడ్ హీరోయిన్‌తో హార్దిక్ పాండ్యా డ్యాన్స్ చూశారా.. వీడియో వైరల్

ముంబైలో అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో హార్దిక్ పాండ్యా బాలీవుడ్ హీరోయిన్..

Hardik Pandya Dance With Ananya Pandey

Anant Ambani Radhika Merchant Wedding : గత మూడు రోజులుగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు ముంబైలో ఘనంగా జరుగుతున్నాయి. వీరి వివాహానికి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ, వ్యాపార ప్రముఖులు, క్రికెటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, జస్ర్పీత్ బుమ్రాతోపాటు పలువురు టీమిండియా క్రికెటర్లు తమతమ సతీమణులతో వివాహానికి హాజరయ్యారు. టీమిండియా ప్లేయర్, ఐపీఎల్ లో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకూడా అనంత్ అంబానీ, రాధికా వివాహ వేడుకకు హాజరయ్యాడు.

Also Read : James Anderson : అంత‌ర్జాతీయ క్రికెట‌ర్‌కు జేమ్స్ ఆండర్సన్ వీడ్కోలు.. సచిన్ ఎమోషనల్ వీడియో చూశారా..

హార్దిక్ పాండ్యా ఇటీవల కాలంలోతన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడాకుల విషయంలో నిత్యం మీడియాలో హైలెట్ అవుతున్నాడు. గతంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా హార్ధిక్ పక్కన నటాషా కనిపించింది. కానీ, ప్రస్తుతం వారి మధ్య విడాకుల వ్యవహారం నడుస్తుండటంతో హార్దిక్ పాండ్యా ఒక్కడే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇటీవల ఓ యువతితో హార్దిక్ కనిపించడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. నటాషాతో విడాకుల అనంతరం హార్దిక్ చేసుకోబోయే యువతి ఈమెనే అంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ తో హార్దిక్ పాండ్యా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : ధోనీకి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..! ఆత్మకథలో ఆసక్తికర విషయాన్ని చెప్పిన అశ్విన్

ముంబైలో అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో హార్దిక్ పాండ్యా పాల్గొన్నాడు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనన్యపాండేతో హార్దిక్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అనన్యపాండే హార్దిక్ పాండ్యాకు డ్యాన్స్ స్టెప్పులు నేర్పుతున్నట్లు కనిపించింది. బాలీవుడ్ హీరోయిన్ ను అనుకరిస్తూ హార్దిక్ డ్యాన్స్ వేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.