Hardik Pandya explains Yash Dayal's absence from Gujarat Titans XI
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అనామకులు కాస్త ఓవర్ నైట్ స్టార్‌లుగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో ఒక్క మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేక పోవడంతో తరువాత మ్యాచుల్లో కనిపించకుండా పోయినా ఆటగాళ్లను చూశాం. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్ ఒకరిని హీరోని చేస్తే మరొకరిని జీరోని చేసింది.
ఆఖరి ఓవర్‌లో ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్ హీరో కాగా అతడి బాధితుడు గుజరాత్ టైటాన్స్‌కు చెందిన యష్ దయాల్. ఈ మ్యాచ్ తరువాత మరో మ్యాచ్ ఆడలేదు యష్ దయాల్. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరుగుతుంటాయని అతడికి మరో అవకాశం ఇవ్వలేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మద్దతు ఇస్తున్నామని జట్టు ఆటగాళ్లు చెబుతున్నప్పటికీ తుది జట్టులో అతడు ఎందుకు ఆడడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ముంబైతో మ్యాచ్ అనంతరం దీనిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. అతడి వల్లే గుజరాత్ ఓడిపోయిందన్న బాధలో యష్‌దయాల్ అనారోగ్యం బారిన పడ్డాడట. దాదాపు ఏడు నుంచి ఎనిమిది కిలోల బరువును కోల్పోయాడని హార్దిక్ చెప్పాడు. అదే సమయంలో వైరల్ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు తెలిపాడు. అతడు ఎదుర్కొన్న ఒత్తిడి కారణంగా ప్రస్తుతం అతడు బరిలోకి దిగే పరిస్థితి లేదు. అతడిని మైదానంలో చూసేందుకు చాలా సమయమే పడుతుందని హార్ధిక్ పేర్కొన్నాడు.
యష్ దయాల్‌కు జట్టు మొత్తం అండగా ఉందని సహచర ఆటగాళ్లు చెబుతున్నప్పటికి ఆ బాధ నుంచి యష్ దయాల్ కోలుకోలేకపోతున్నాడని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ త్వరగా అతడు కోలుకుని తిరిగి జట్టులోకి రావాలని నెటీజన్లు ఆకాంక్షిస్తున్నారు. యష్ దయాల్ స్థానంలో సీనియర్ ఆటగాడు మోహిత్ శర్మ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. నాలుగు మ్యాచుల్లో 6.15 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు.
IPL 2023, GT vs MI: చేతులెత్తేసిన బ్యాటర్లు.. ముంబై పై గుజరాత్ ఘన విజయం