అదే కారణమా : హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌కు కూడా దూరమే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు ఆరంభమవుతుందా అని ఎదురుచూసే అభిమానులే కాదు. క్రికెటర్లూ ఉంటారు. ఈ పొట్టి లీగ్‌లో బౌండరీలే హద్దుగా చెలరేగి ఆడే బ్యాట్స్‌మెన్ స్పిన్ మాయగాళ్లైన బౌలర్లు రికార్డుల మోత మోగిస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం వరల్డ్ కప్ 2019కు కొద్ది రోజుల ముందువరకూ లీగ్ జరగాల్సి ఉండటంతో క్రికెటర్లు దాదాపు విశ్రాంతి కోసం చూస్తున్నారు.
Read Also:ఆ ముగ్గురిలో : ధోనీ తర్వాత సూపర్ కింగ్స్‌కి కెప్టెన్?
దాని కంటే ముందుగానే ఆస్ట్రేలియాతో భారత్ ఆడనున్న సిరీస్‌లకు పాండ్యా దూరం కానున్నాడని బీసీసీఐ ప్రకటించింది. అతని బదులు రవీంద్ర జడేజాను ఎంపిక చేస్తున్నట్లుగా వెల్లడించింది. కేవలం విశ్రాంతిని ఆసీస్‌తో సిరీస్‌కే పరిమితం చేసుకుంటాడా.. లేదా ఐపీఎల్‌లో ఆడకుండానే ముగిస్తాడా అనే సందేహాలు మొదలైయ్యాయి.
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీ వాలీ లీగ్ అయిన ఐపీఎల్ మార్చి 23 నుంచి ఆరంభం కానుంది. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గతంలో ఇదే కారణంతో ఆసియా కప్ నుంచి దూరమై వెస్టిండీస్‌తో సొంతగడ్డపై ఆడిన మ్యాచ్‌లలోనూ, ఆస్ట్రేలియా పర్యటనలకు దూరం అయ్యాడు. ఇప్పుడు అదే సమస్య తలెత్తడంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లతో పాటు ఐపీఎల్‌లోనూ విశ్రాంతి తీసుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది.
Read Also:ఎందుకంట: IPL 2019 ఆరంభ వేడుకలు రద్దు