Hardik pandya smashes 29 runs in one over in Syed Mushtaq Ali T20 Trophy
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. బరోడాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆల్‌రౌండర్ బుధవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించి ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 69 పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. జగదీషన్ (32 బంతుల్లో 57), విజయ్ శంకర్ (22 బంతుల్లో 42 నాటౌట్), షారుక్ ఖాన్ (25 బంతుల్లో 39) రాణించారు. బరోడా బౌలర్లలో మెరీవాలా మూడు వికెట్లు తీశాడు. అనంతరం హార్థిక్ పాండ్య విధ్వంసకర అర్థశతకంతో పాటు భాను పనియా (20 బంతుల్లో 42 ) రాణించడంతో 222 పరుగుల లక్ష్యాన్ని బరోడా సరిగ్గా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
6, 6, 6, 6, 4..
ఈ మ్యాచ్‌లో బరోడా ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో హార్దిక్ విధ్వంసం సృష్టించాడు. గుర్జప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో మొదటి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ తరువాత ఓ నోబాల్ వేయగా మరో సిక్సర్, బౌండరీ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 29 పరుగులను సాధించాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుర్జప్‌నీత్ సింగ్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో పోటీపడి మరీ అతడిని రూ.2.20 కోట్లకు దక్కించుకుంది. గతంలో అతడు సీఎస్‌కే నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం హార్దిక్ 29 పరుగుల వీడియో వైరల్‌గా మారింది.
6⃣,6⃣,6⃣,6⃣,4⃣
One goes out of the park 💥
Power & Panache: Hardik Pandya is setting the stage on fire in Indore 🔥🔥
Can he win it for Baroda?
Scorecard ▶️ https://t.co/DDt2Ar20h9#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/Bj6HCgJIHv
— BCCI Domestic (@BCCIdomestic) November 27, 2024