Harry Brook scores second fastest triple century in Test cricket history
ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ పరుగుల వరద పారించాడు. ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో బ్రూక్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన జాబితాలో రెండో స్థానంలో బ్రూక్ నిలిచాడు. ఇంగ్లాండ్ తరుపున ట్రిపుల్ సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
టెస్టుల్లో అత్యంత వేగవంతంగా ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డు టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. దక్షిణాఫ్రికా పై సెహ్వాగ్ 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదాడు.
టెస్టుల్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు..
* వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) – 2008లో చెన్నై వేదికగా దక్షిణాఫ్రికా పై 278 బంతుల్లో
* హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 2024 ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ పై 310 బంతుల్లో
* మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా) – 2003లో పెర్త్ వేదికగా జింబాబ్వే పై 362 బంతుల్లో
* వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) – 2004 ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ పై 364 బంతుల్లో
టెస్టుల్లో ఇంగ్లాండ్ తరుపున ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లు..
1930లో ఆండీ సంధమ్ వెస్టిండీస్ పై 325 పరుగులు
1933లో వాలీ హమ్మండ్ న్యూజిలాండ్ పై 336* పరుగులు
1938లో లెన్ హట్టన్ ఆస్ట్రేలియా పై 364 పరుగులు
1965లో జాన్ ఎడ్రిచ్ న్యూజిలాండ్ పై 310* పరుగులు
1990లో గ్రాహం గూచ్ భారత్ పై 333 పరుగులు
2024లో హ్యారీ బ్రూక్ పాకిస్థాన్ పై 317 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 556 పరుగులు చేసింది. అనంతరం బ్రూక్ (317; 322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీతో పాటు జో రూట్ (262; 375 బంతుల్లో 17 ఫోర్లు) ద్విశతకం బాదడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 823-7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 267 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
Riyan Parag : రియాన్ పరాగ్ వింత బౌలింగ్.. తిక్క కుదిర్చిన అంపైర్!
THE 2ND FASTEST TRIPLE CENTURY IN TEST HISTORY. 🥶
– Harry Brook reached his 300 with 97.41 Strike Rate. 🤯 pic.twitter.com/knYkZg6fgS
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2024