Womens T20 World Cup 2024 : భారత్ సెమీస్ చేరాలంటే.. ఆస్ట్రేలియాపై ఎంత తేడాతో గెలవాలో తెలుసా? ఓడినా అవకాశం ఉందా?
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతోంది.

Womens T20 World Cup 2024 How can India make it to the semi finals
Womens T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక పై 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో తన నెట్‌రన్‌రేట్‌ను భారత్ గణనీయంగా మెరుగుపరచుకుంది. గ్రూపు-ఏలో ఉన్న భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. గ్రూపు స్టేజీలో తన చివరి లీగ్ మ్యాచ్‌ను డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆడనుంది.
గ్రూపుఏలో రెండు మ్యాచులు గెలిచిన ఆస్ట్రేలియా 4 పాయింట్లు +2.524 నెట్‌రన్‌రేటుతో అగ్రస్థానంలో ఉంది. మరో రెండు మ్యాచులను ఆసీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కటి గెలిచినా కూడా ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ పెను సంచనాలు నమోదై ఈ రెండు మ్యాచులు (భారత్, పాక్ పై) ఓడినా కూడా మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగి ఉంటే ఆసీస్ సెమీస్ చేరుకోవచ్చు.
Riyan Parag : రియాన్ పరాగ్ వింత బౌలింగ్.. తిక్క కుదిర్చిన అంపైర్!
మిగిలిన ఒక్క స్థానం కోసం భారత్ (4 పాయింట్లు, +0.576), పాకిస్థాన్ (2 పాయింట్లు, +0.555), న్యూజిలాండ్ (2 పాయింట్లు, -0.050), శ్రీలంక (-2.564)లు పోటీపడుతున్నాయి. ఒక్క మ్యాచ్ గెలవని లంక రేసు నుంచి ఎప్పుడో నిష్ర్కమించింది. ప్రధాన పోటీ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉంటుంది. భారత జట్టు తన చివరి మ్యాచులో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచులో తప్పకుండా విజయం సాధించాలి. అప్పుడు భారత్ ఖాతాలో ఆరు పాయింట్లు వచ్చి చేరుతాయి.
అదే సమయంలో న్యూజిలాండ్ తన చివరి రెండు మ్యాచుల్లో పాకిస్థాన్, శ్రీలంక పై గెలిస్తే అప్పుడు కివీస్ ఖాతాలోనూ ఆరు పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగిన జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది.
టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియా పై ఇలా గెలవాల్సి ఉంటుంది. ఒక వేళ భారత్ ఒక్క పరుగు తేడాతో ఆస్ట్రేలియా పై గెలిస్తే.. అప్పుడు న్యూజిలాండ్ తన చివరి రెండు మ్యాచుల్లో కలిపి 38 పరుగుల కంటే తక్కువ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధిస్తే.. కివీస్ 48 పరుగుల కంటే తక్కువ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు భారత నెట్‌రన్‌రేట్‌ను కివీస్ అధిగమించలేదు.
ఒకవేళ భారత్ ఓడిపోతే..
ఒకవేళ భారత జట్టు తన ఆఖరి మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా సెమీస్ కు చేరే అవకాశం ఉంది. అప్పుడు మిగిలిన మ్యాచుల్లో కివీస్, పాక్ జట్లు ఒక్కొ మ్యాచులో ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో భారత్ ఆసీస్ చేతిలో చాలా స్వల్ప తేడాతో ఓడిపోవాలి. అప్పుడు మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగి ఉంటే భారత్ సెమీస్‌కు చేరుకుంటుంది.