Courtesy BCCI
క్రికెట్‌లో ఒక్క క్యాచ్ సైతం పూర్తి మ్యాచ్ గమనాన్ని మార్చిన సందర్భాలు ఎన్నో చూసే ఉంటాం. అందుకనే అన్ని జట్లు కూడా తమ ఫీల్డింగ్ ను నిరంతరం మెరుగుపరచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కొందరు ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లు అందుకోవడాన్ని చూశాం. అదే సమయంలో మరికొందరు సింపుల్ క్యాచ్‌లను సైతం మిస్ చేయడాన్ని చూశాం.
గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతానైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హర్షల్ పటేల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసి ఊపు మీదున్న అంగ్క్రిష్ రఘువంశీ క్యాచ్‌ను హర్షల్ పటేల్ సూపర్‌గా అందుకున్నాడు.
RCB vs GT : బెంగళూరు పై ధనాధన్ ఇన్నింగ్స్.. చాలా అవమానకరంగా అనిపించిందన్న జోస్ బట్లర్..
Left 👉 Right
Right 👉 Left
Confused? 🤔That’s what Kamindu Mendis causes in the minds of batters 😉
Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @SunRisers pic.twitter.com/IJH0N1c3kT
— IndianPremierLeague (@IPL) April 3, 2025
ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను కమిందు మెండిస్ వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతిని అంగ్క్రిష్ రఘువంశీ కవర్స్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే మిస్‌టైమింగ్ కావడంతో బాల్ డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హర్షల్ పటేల్ పరిగెత్తుకుంటూ వచ్చి ముందుకు డైవ్ చేస్తూ చక్కని క్యాచ్ అందుకున్నాడు.
అయితే.. హర్షల్ క్యాచ్ అందుకునేటప్పుడు అతడి చేయి నేలను తాకినట్లుగా కనిపించింది. దీంతో బంతి కూడా నేలను తాకిందనే అనుమానంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సాయం కోరాడు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ క్లీన్ క్యాచ్‌గా ప్రకటించాడు. కాగా.. హర్షల్ పటేల్ క్యాచ్ అందుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో అంగ్క్రిష్ రఘువంశీ 32 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు.
Ishan Kishan : దేవుడా.. ఇషాన్ కిషన్ మరో హ్యారీ బ్రూక్ కాకుండా చూడు సామీ..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (60), అంగ్క్రిష్ రఘువంశీ (50) లు హాఫ్ సెంచరీలు బాదారు. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 80 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.