RCB vs GT : బెంగళూరు పై ధనాధన్ ఇన్నింగ్స్.. చాలా అవమానకరంగా అనిపించిందన్న జోస్ బట్లర్..
బెంగళూరు విధ్వంసకర ఆటగాడు ఫిల్ సాల్ట్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను బట్లర్ జారవిడిచాడు.

Courtesy BCCI
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ధనాధన్ బ్యాటింగ్‌తో గుజరాత్ కు విజయాన్ని అందించాడు జోస్ బట్లర్. 39 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. బట్లర్ విజృంభణతో 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.
కాగా.. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో బట్లర్ ఓ క్యాచ్‌ను మిస్ చేశాడు. బెంగళూరు విధ్వంసకర ఆటగాడు ఫిల్ సాల్ట్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. క్యాచ్ వదిలివేసినందుకు చాలా సిగ్గుపడ్డానని, ఇది తనకు చాలా అవమానకరంగా అనిపించిందని బట్లర్ చెప్పాడు.
మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ను ఎంతో ఆస్వాదించినట్లుగా చెప్పుకొచ్చాడు. గుజరాత్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారన్నాడు. తన కీపింగ్‌తో పాటు జట్టు ఫీల్డింగ్‌లో ఇంకొంచెం మెరుగు అవ్వాల్సి ఉందని చెప్పాడు. తాము ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే.. ఇంకో 30 పరుగుల తక్కువ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేదన్నాడు.
ఇక తాను ఫిల్ సాల్ట్ క్యాచ్ వదిలివేసినందుకు సిగ్గుపడినట్లుగా చెప్పుకొచ్చాడు. సాల్ట్ డేంజరస్ బ్యాటర్ అని, అతడి క్యాచ్ పట్టి హెర్షెల్ గిబ్స్ తరహాలో సంబురాలు చేసుకోవాలని భావించినట్లుగా తెలిపాడు. అయితే.. కాస్త ముందుగానే సంబురాలు చేసుకోవడంతో బంతి చేజారిందన్నాడు.
Virat Kohli : గుజరాత్ టైటాన్స్ పై చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..
Jos Buttler said, “I was pretty embarrassed with myself after that drop, but due to that embarrassment I was determined to do well with the bat”. pic.twitter.com/liErBt8A8t
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2025
ఇక కొత్త బంతితో బౌలర్లకు స్వింగ్ లభిస్తోందని, గెలుపు క్రెడిట్ ఓపెనర్లదేని తెలిపాడు. బంతి స్వింగ్ అవుతున్నా ఆరంభంలో చాలా బాగా ఆడారని తెలిపాడు. తమ జట్టులో నాణ్యమైన బౌలర్లతో పాటు డేంజరస్ బ్యాటర్లు ఉన్నారని బట్లర్ అన్నాడు
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్ (54; 40 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) అర్థశతకం బాదాడు. జితేశ్ శర్మ(33; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (32; 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. సాయి కిశోర్ రెండు వికెట్లు పడగొట్టగా, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మలు తలా ఓ వికెట్ తీశారు.
RCB vs GT : బెంగళూరుపై మ్యాచ్ విన్నింగ్స్ ప్రదర్శన.. సిరాజ్ భావోద్వేగం..
అనంతరం లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. బట్లర్‌తో పాటు సాయి సుదర్శన్ (49; 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (30నాటౌట్; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు దంచికొట్టారు.