Virat Kohli : గుజరాత్ టైటాన్స్ పై చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..
విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

Courtesy BCCI
పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.
బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విఫలం అయ్యాడు. 6 బంతులు ఆడి ఓ ఫోర్ సాయంతో 7 పరుగులు చేశాడు. అయినప్పటికి ఓ ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో అతడు రుతురాజ్ గైక్వాడ్ రికార్డును బ్రేక్ చేశాడు. గైక్వాడ్ ఏడు మ్యాచ్‌ల్లో 350 పరుగులు చేయగా, కోహ్లీ ఏడు మ్యాచ్‌ల్లో 351 పరుగులు సాధించాడు. వీరిద్దరి తరువాత సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌లు ఉన్నారు.
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ – 7 మ్యాచ్‌ల్లో 351 పరుగులు
రుతురాజ్ గైక్వాడ్ – 7 మ్యాచ్‌ల్లో 350 పరుగులు
సూర్యకుమార్ యాదవ్ – 5 మ్యాచ్‌ల్లో 248 పరుగులు
సంజూ శాంసన్ – 6 మ్యాచ్‌ల్లో 230 పరుగులు
జోస్ బట్లర్ – 6 మ్యాచ్‌ల్లో 198 పరుగులు
కాగా.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో కలిపి నాలుగు జట్లపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. అతడు ఢిల్లీ క్యాపిటల్స్ (1057), చెన్నై సూపర్ కింగ్స్ (1084), రాజస్థాన్ రాయల్స్ (764) లపై అత్యధిక పరుగులు చేశాడు.
RCB vs GT : బెంగళూరుపై మ్యాచ్ విన్నింగ్స్ ప్రదర్శన.. సిరాజ్ భావోద్వేగం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు సాధించింది.బెంగళూరు బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్ (54) హాఫ్ సెంచరీ బాదాడు. ఫిల్ సాల్ట్ (14), విరాట్ కోహ్లీ (7), దేవదత్ పడిక్కల్ (4) లు విఫలమైనప్పటికి జితేశ్ శర్మ(33), టిమ్ డేవిడ్ (32) లు రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిశోర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మలు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు)లతో పాటు సాయి సుదర్శన్ (49; 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (30నాటౌట్ 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు.