RCB vs GT : ఓటమి బాధలో RCB.. కోహ్లీ ఫ్యాన్స్ కు మరో షాక్.. విరాట్ నెక్ట్స్ మ్యాచ్ ఆడడం డౌటే.. ఎందుకంటే..

బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న క్ర‌మంలో కోహ్లీ చేతికి గాయ‌మైంది.

RCB vs GT : ఓటమి బాధలో RCB.. కోహ్లీ ఫ్యాన్స్ కు మరో షాక్.. విరాట్ నెక్ట్స్ మ్యాచ్ ఆడడం డౌటే.. ఎందుకంటే..

pic credit @mufaddal_vohra

Updated On : April 3, 2025 / 10:00 AM IST

ఐపీఎల్ 18వ సీజ‌న్‌ను వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో మొద‌లు పెట్టిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈ సీజ‌న్‌లో తొలి ఓట‌మిని చ‌విచూసింది. బుధ‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ (54; 40 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. జితేశ్ శ‌ర్మ‌(33), టిమ్ డేవిడ్ (32) లు రాణించ‌గా.. ఫిల్ సాల్ట్ (14), విరాట్ కోహ్లీ (7), దేవద‌త్ ప‌డిక్క‌ల్ (4) లు విఫ‌లం అయ్యారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. సాయి కిశోర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అర్ష‌ద్ ఖాన్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ‌, ఇషాంత్ శ‌ర్మ‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.

IPL 2025 : రోహిత్ శ‌ర్మ పై ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు ఘాటు విమ‌ర్శ‌లు.. ‘నీ పేరు రోహిత్ శ‌ర్మ కాక‌పోయుంటే..’

ఆ త‌రువాత జోస్ బ‌ట్ల‌ర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు)ల‌తో పాటు సాయి సుద‌ర్శ‌న్ (49; 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (30నాటౌట్; 18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌డంతో ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ 17.5 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.

విరాట్ కోహ్లీకి గాయం..

గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గాయ‌ప‌డ్డాడు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న క్ర‌మంలో కోహ్లీ చేతికి గాయ‌మైంది. గుజ‌రాత్ ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

NZ vs PAK : కొద్దిలో బాబ‌ర్ అజామ్ సెంచరీ మిస్‌.. నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

ఈ ఓవ‌ర్‌ను కృనాల్ పాండ్య వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బంతిని గుజ‌రాత్ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ భారీ షాట్ కొట్టాడు. డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ బంతిని ఆపేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. బంతి కోహ్లీ కుడి చేతిని తాకుతూ బౌండ‌రీకి వెళ్లింది. వెంట‌నే కోహ్లీ నొప్పితో మైదానంలో మోకాలిపై కూర్చుండిపోయాడు.

మెడిక‌ల్ సిబ్బంది వెంట‌నే కోహ్లీ వ‌ద్ద‌కు వ‌చ్చి ప్రాథ‌మిక చికిత్స అందించారు. ఆ త‌రువాత కోహ్లీ ఫీల్డింగ్ కొన‌సాగించాడు. అయిన‌ప్ప‌టికి అత‌డు ఇబ్బంది ప‌డుతున్న‌ట్లుగానే క‌నిపించింది. దీంతో ఆర్‌సీబీ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

కాగా.. కోహ్లీ గాయం పై ఆర్‌సీబీ ఇంత వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ చెప్ప‌లేదు. అయిన‌ప్ప‌టికి అత‌డికి రాబోయే 12 నుంచి 24 గంట‌లు కీల‌కం. గాయం తీవ్ర‌మైన‌ది అయితే అత‌డు త‌దుప‌రి మ్యాచ్ ఆడ‌క‌పోవ‌చ్చు.

RCB vs GT : బెంగ‌ళూరుపై మ్యాచ్ విన్నింగ్స్ ప్ర‌ద‌ర్శ‌న‌.. సిరాజ్ భావోద్వేగం..

ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌లో విఫ‌లం అయ్యాడు. 6 బంతుల్లో 7 ప‌రుగులు చేసి అర్ష‌ద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ప్ర‌సిద్ధ్ కృష్ణ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు.