NZ vs PAK : కొద్దిలో బాబ‌ర్ అజామ్ సెంచరీ మిస్‌.. నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

న్యూజిలాండ్ బ్యాట‌ర్లు రాణించిన పిచ్ పై పాక్ టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

NZ vs PAK : కొద్దిలో బాబ‌ర్ అజామ్ సెంచరీ మిస్‌.. నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

NZ vs PAK 2nd odi Babar Azam Missed Century By Just 99 Runs Pakistan Star Trolled

Updated On : April 2, 2025 / 2:43 PM IST

పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే న్యూజిలాండ్ కైవ‌సం చేసుకుంది. బుధ‌వారం హామిల్ట‌న్ వేదిక‌గా జరిగిన రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ 84 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. కేన్ విలియ‌మ్స‌న్‌, మిచెల్ సాంట్న‌ర్‌, గ్లెన్ ఫిలిప్స్‌, ర‌చిన్ ర‌వీంద్ర‌, ఫెర్గూస‌న్, డేవాన్ కాన్వే, మాట్ హెన్రీ వంటి కీల‌క ఆట‌గాళ్లు లేక‌పోయినా కూడా పాక్ జట్టును కివీస్ చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 292 ప‌రుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ హే (99 నాటౌట్; 78 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ముహమ్మద్ అబ్బాస్ (41; 66 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు. పాక్ బౌల‌ర్ల‌లో సుఫియాన్ ముఖీమ్, మహ్మద్ వసీం జూనియర్ లు చెరో రెండు వికెట్లు తీశారు.

LSG vs PBKS : ప్రొఫెషనల్ క్రికెట‌ర్ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా.. బాల్‌బాయ్ సూప‌ర్ క్యాచ్‌.. కోచ్ పాంటింగ్ రియాక్ష‌న్ చూశారా?

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాక్ 41.2 ఓవ‌ర్ల‌లో 208 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పాక్ బౌల‌ర్ల‌లో ఫహీద్ అష్రాఫ్‌ (73; 80 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), బౌలర్ నసీమ్ షా (51; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. కివీస్ బౌల‌ర్ల‌లో బెన్ సియర్స్ ఐదు వికెట్ల‌తో పాక్ ప‌త‌నాన్ని శాసించాడు. జాకబ్ డఫీ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

32 ప‌రుగుల‌కే 5 వికెట్లు..
ల‌క్ష్య ఛేద‌న‌లో న్యూజిలాండ్ బౌల‌ర్ల ధాటికి పాక్ విల‌విల‌లాడింది. సల్మాన్ అఘా (9), కెప్టెన్ రిజ్వాన్ (5), ఇమాముల్ హక్ (3), బాబర్ అజామ్ (1), అబ్దులా షఫీక్ (1) లు విప‌లం కావ‌డంతో 32 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డ‌గా.. 114 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయింది.

ఈ ద‌శ‌లో ఫహీమ్‌- నసీమ్ షా జోడి తొమ్మిదో వికెట్‌కు 60 ప‌రుగులు జోడించారు. వీరి పోరాటం ఓట‌మి అంత‌రాన్ని త‌గ్గించ‌డానికే ఉప‌యోగ‌ప‌డింది.

Shreyas Iyer-MS Dhoni : శ్రేయ‌స్ అయ్య‌ర్ అరుదైన ఘ‌న‌త‌.. ఎంఎస్ ధోని కెప్టెన్సీ రికార్డ్ బ్రేక్‌..

బాబ‌ర్ పై విమ‌ర్శ‌లు..
న్యూజిలాండ్ బ్యాట‌ర్లు రాణించిన పిచ్ పై పాక్ టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ అజామ్‌ పై నెటిజ‌న్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో 3 బంతులు ఎదుర్కొన్న ఆజాం ఒకే ఒక ర‌న్ తీసి ఔట్ అయ్యాయి. దీనిని ఎత్తిచూపుతూ.. బాబ‌ర్ తృటిలో సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. ఇంకో 99 ప‌రుగులు చేసి ఉంటేనా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

LSG vs PBKS : ఓట‌మి బాధ‌లో ఉన్న ల‌క్నోకు షాక్‌.. పంజాబ్ పై వికెట్లు తీసిన ఏకైక బౌల‌ర్ పై బీసీసీఐ కొర‌డా..