Ishan Kishan : దేవుడా.. ఇషాన్ కిషన్ మరో హ్యారీ బ్రూక్ కాకుండా చూడు సామీ..
ఇషాన్ కిషన్ ఫామ్ పై ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

SRH player Ishan Kishan fails two matchs after score century against RR
అది 2023 సంవత్సరం. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ తరుపున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడడంతో ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం అతడి పై భారీ ఆశలనే పెట్టుకుంది. అయితే.. ఐపీఎల్ 2023 సీజన్‌లో అతడు అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ పై 55 బంతుల్లో సెంచరీ చేసి అభిమానులను మురిపించినా.. మిగిలిన మ్యాచ్‌ల్లో ఓ మోస్తరు ప్రదర్శన సైతం చేయలేకపోయాడు. మొత్తంగా ఐపీఎల్ 2023 సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన బ్రూక్ 22.11 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2023 ముగిసిన వెంటనే అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది.
బ్రూక్ పేరు చెబితే చాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ వద్దు బాబోయ్.. వద్దు అని ఇప్పటికి అంటారు అంటే అతడు ఎంతలా విఫలం అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.
తొలి మ్యాచ్‌లో శతకంతో అలరించినా..
కట్ చేస్తే ఐపీఎల్ 2024లో అద్వితీయ ఆటతీరుతో ఎస్ఆర్‌హెచ్ ఫైనల్‌కు చేరుకుంది. ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో మెగావేలంలో ఇషాన్ కిషన్, షమీ వంటి ఆటగాళ్లను ఎస్ఆర్‌హెచ్ తీసుకుంది.
ఐపీఎల్ 2025 వేలంలో ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఇక ఇషాన్ సైతం రాజస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. కేవలం 45 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో మరో విధ్వంసకర ఆటగాడు జట్టులో చేరాడని ఫ్యాన్స్ ఆనంద పడ్డారు.
RCB vs GT : బెంగళూరు పై ధనాధన్ ఇన్నింగ్స్.. చాలా అవమానకరంగా అనిపించిందన్న జోస్ బట్లర్..
అయితే.. లక్నోతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇషాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఢిల్లీతో జరిగిన మూడో మ్యాచ్‌లో నూ అతడు విఫలం అయ్యాడు. 5 బంతులు ఆడి రెండు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడు మరో హ్యారీబ్రూక్ కాకుండా చూడు సామీ అంటూ వేడుకుంటున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఎస్ఆర్‌హెచ్ నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా ఇషాన్ కిషన్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.