Hasin jahan says mohammed shami ignoring his daughter
Mohammed Shami : టీమ్ఇండియా మాజీ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) పై సోషల్ మీడియా వేదికగా మరోసారి ఆక్రోశాన్ని వెళ్లగక్కింది హసీన్ జహాన్ ( Hasin Jahan). తమ కూతురు ఐరా(Ayra)ను మంచి స్కూల్‌లో చేర్పించడం షమీకి ఇష్టం లేదని ఆరోపించింది. అయితే.. తమ కూతురు ఐరాకు ఓ అంతర్జాతీయ పాఠశాలలో సీటు లభించిందని పేర్కొంది.
షమీ ఓ స్ర్తీ లోలుడని, అతడు తన గర్ల్‌ఫ్రెండ్స్ పిల్లలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాడని వెల్లడించింది. గర్ల్‌ఫ్రెండ్స్‌తో పాటు వారి పిల్లలకు అతడు ఖరీదైన బహుమతులను ఇచ్చాడని తెలిపింది. తమ కూతురు ఐరాను మాత్రం పూర్తిగా విస్మరించాడని, కనీసం ఆమె స్కూల్ చదువుకు కూడా డబ్బులు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Gautam Gambhir : ఆసియా కప్ 2025 ముందు ఉజ్జయినిలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ప్రత్యేక పూజలు..
‘నా కూతురి తండ్రి (షమీ) ఓ బిలియనీర్. అతడు తన ఉంపుడుగత్తెల పిల్లలను ఉన్నత పాఠశాలలో చదువుకునేందుకు సహకరిస్తున్నాడు. కొందరికి బిజినెస్ క్లాస్ విమానాల్లో ప్రయాణించిడానికి లక్షల్లో ఖర్చు చేస్తున్నాడు. కానీ.. తన కూతురు చదువుకు మాత్రం ఏం చేయడం లేదు. తన కూతురిని అసలు పట్టించుకోవడం లేదు.’ అని హసీనా జహాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
టీమ్ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీకి, మోడల్ అయిన హసీన్ జహాన్ లకు 2014లో వివాహాం జరిగింది. 2015లో వీరికి ఓ కూతురు (ఐరా) పుట్టింది. ఆ తరువాత కొన్నాళ్లకు దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో 2018 నుంచి విడివిడిగా ఉంటున్నారు. షమీపై గృహ హింస ఆరోపణలు చేసి న్యాయస్థానం మెట్లెక్కింది హసీన్ జహాన్. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.
ఇటీవల కోల్‌కతా హైకోర్టు హసీన్ జహాన్, కూతురు ఐరా సంరక్షణ కోసం నెలకు రూ.4లక్షలు భరణం కింద చెల్లించాలని షమీకి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.