HCA ఎన్నికలు : అధ్యక్షుడు ఎవరో

హెచ్‌సీఏ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. 6 పదవులకు 17 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు తాను కృషి చేస్తానని, ఉన్నత స్థానంలో నిలుపుతానని హామీనిస్తున్నారు అజారుద్దీన్.
టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్‌లు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. అయితే కోర్టు కేసులు ఉన్నాయంటూ వివేక్ నామినేషన్ తిరస్కరించడంతో ప్రకాశ్ చంద్ తెరపైకి వచ్చారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. 226 మంది ఓటర్లున్న హెచ్‌సీఏలో ప్రధాన పోటీ వివేక్, అజారుద్దీన్‌ల మధ్యే అని అందరూ ఊహించారు. కానీ వివేక్ నామినేషన్ తిరస్కరించడంతో.. వార్ వన్ సైడయినట్లు అందరూ భావించారు. ప్రకాశ్ చంద్, అజారుద్దీన్ మధ్య పోటీ నెలకొంది. మరి అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చొనున్నారో కొద్ది గంటల్లో తెలియనుంది.
Read More : అధ్యక్షుని రేసులో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్