Virat Kohli: విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ వీడియో లీక్.. క్షమాపణలు చెప్పిన హోటల్ యాజమాన్యం

ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో విరాట్ కోహ్లీ బస చేసిన హోటల్ రూమ్‌కు సంబంధించిన వీడియో లీకైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందించింది.

Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత జట్టుతో కలిసి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కోహ్లీ బస చేస్తున్న క్రౌన్ పెర్త్ హోటల్ గదికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో లీకైంది.

PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని

దీనిపై కోహ్లీతోపాటు, ఆయన సతీమణి అనుష్క శర్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు హోటల్ గదిలో కూడా పైరసీ లేకపోతే ఎలా అని ప్రశ్నించాడు. ఈ వీడియో తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. అయితే, ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం స్పందించింది. విరాట్ కోహ్లీకి క్షమాపణలు తెలిపింది. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ‘‘మా హాటల్‌కు వచ్చే అతిథుల భద్రత, ప్రైవసీ మా మొదటి ప్రాధాన్యం. తాజా ఘటన విషయంలో మేం కలత చెందాం. దీనిపై మా అతిథికి మేం క్షమాపణలు చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ప్రవర్తనను మేం ప్రోత్సహించం’’ అని హోటల్ యాజమాన్యం తన ప్రకటనలో పేర్కొంది.

Elon Musk: ట్విట్టర్ బ్లూటిక్‌కు డబ్బులు కట్టాల్సిందేనా.. నెలకు ఎంతంటే!

మరోవైపు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, వారిని విధుల్లోంచి తొలగిస్తామని కంపెనీ ప్రకటించింది. అలాగే ఒరిజినల్ వీడియోను కూడా వెంటనే తొలగించినట్లు హోటల్ పేర్కొంది. దీనికి సంబంధించిన విచారణ విషయంలో ఇండియన్ క్రికెట్ టీమ్‌తోపాటు ఐసీసీకి కూడా సహకరిస్తామని వెల్లడించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు