Hours after achieving the milestone Mustafizur Rahman was released by KKR
Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో రంగపూర్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ శుక్రవారం సిల్హెట్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ముస్తాఫిజుర్ 24 పరుగులు ఇచ్చి మొత్తంగా మూడు వికెట్లు సాధించాడు. కాగా.. ఈ మైలురాయిని సాధించడం పట్ల ముస్తాఫిజుర్ రెహమాన్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
AUS vs ENG : సిడ్నీలో 137 ఏళ్ల సంప్రదాయం విచ్ఛిన్నమైంది.. చరిత్రను మార్చిన స్టీవ్ స్మిత్..
Alhamdulillah for another milestone. 400 T20 wickets and a solid win against the Sylhet Titans. Always grateful to perform. Thanks to everyone for the love and support. pic.twitter.com/K6jlqRRfNc
— Mustafizur Rahman (@Mustafiz90) January 2, 2026
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం 145 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ మైలురాయిని చేరుకున్న కొన్ని గంటల్లోనే ముస్తాఫిజుర్ ను ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టు అతడిని విడుదల చేసింది. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రికత్త కారణంగా బీసీసీఐ అతడిని జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్ ను ఆదేశించింది.
దీనిపై ముస్తాఫిజుర్ స్పందించాడు. వారు నన్ను విడుదల చేస్తుంటే, నేను ఏమి చేయగలను? అని అన్నాడు. నివేదికల ప్రకారం.. ముస్తాఫిజుర్ ఈ నిర్ణయంతో తీవ్రంగా బాధపడ్డాడు. ఎందుకంటే అతను ఈ అవకాశాన్ని మైదానంలో తన ప్రదర్శన కారణంగా కాదు, బాహ్య పరిస్థితుల కారణంగా కోల్పోయాడు.