AUS vs ENG : సిడ్నీలో 137 ఏళ్ల సంప్రదాయం విచ్ఛిన్నమైంది.. చరిత్రను మార్చిన స్టీవ్ స్మిత్..
సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో (AUS vs ENG) స్పిన్నర్ లేకుండానే ఆస్ట్రేలియా బరిలోకి దిగింది.
Ashes AUS vs ENG 5th test Australia play without a spinner in Sydney after 137 years
- సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆఖరి టెస్టు
- స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగిన ఆస్ట్రేలియా
- సిడ్నీ చరిత్రలో గత 137 ఏళ్లలో ఆసీస్ తొలిసారి ఇలా
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ తుది జట్టులో ఒక్క స్పిన్నర్ కూడా లేకుండానే ఆసీస్ బరిలోకి దిగింది. ఈ మైదానంలో 137 సంవత్సరాల తరువాత ఓ స్పిన్నర్ లేకుండానే ఆసీస్ బరిలోకి దిగడం ఇదే తొలిసారి. గతంలో 1888 సంవత్సరంలో ఇలా జరిగింది.
సాధారణంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానం ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో తుది జట్టులో ఒక్క స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం అనేది స్టీవ్ స్మిత్ సాహసంగానే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీని తమ 12 మంది సభ్యుల జాబితాలో చేర్చినప్పటికీ, మ్యాచ్ రోజున కెప్టెన్ అతడికి తుది జట్టులో చోటు ఇవ్వలేదు.
స్టీవ్ స్మిత్ స్పిన్ ఆప్షన్‌కు బదులుగా మీడియం-పేస్డ్ ఆల్ రౌండర్‌ను ఎంచుకున్నాడు. బ్యూ వెబ్‌స్టర్‌ను తుది జట్టులో చేర్చాడు.
ఆస్ట్రేలియా తుది జట్టు..
ట్రావిస్ హెడ్, జోక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, మైఖేల్ నెసర్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్
Beau Webster returns to the XI as Australia opt against picking a frontline spinner in Sydney for the first time in 138 years.
Full story: https://t.co/1xpR8scqzN pic.twitter.com/YMUjeiG0fm
— cricket.com.au (@cricketcomau) January 3, 2026
BCB : ముస్తాఫిజుర్ సాకుతో టీ20 ప్రపంచకప్ పై డ్రామా మొదటెట్టిన బీసీబీ.. బీసీసీఐతో కయ్యం!
ఇంగ్లాండ్ తుది జట్టు..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్.
