Champions Trophy: అఫ్గానిస్థాన్‌కు అదృష్టం కలిసొస్తుందా.. సెమీఫైనల్స్ కు చేరుతుందా.. సమీకరణాలు ఇలా..
గ్రూప్ -బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాతోపాటు సెమీస్ కు చేరే మరో జట్టు ఏదనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.

Afghanistan
Afghanistan Semifinal Equation: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా లాహోర్‌లో జరిగిన అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజులోకి వచ్చి వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో షార్ట్ (20) ఔట్ అయ్యాడు. హెడ్ (59నాటౌట్), స్మిత్ (19నాటౌట్) క్రీజులో ఉన్నారు. బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో ఆసీస్ జట్టు 12.5 ఓవర్లలో 109 పరుగులు చేయగలిగింది. ఈ సమయంలో వర్షం రాడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఆసీస్, అఫ్గాన్ జట్లకు చెరొక పాయింట్ దక్కింది.
Also Read: Champions Trophy: కోహ్లీ 300వ మ్యాచ్ వేళ కేఎల్ రాహుల్ ప్రశంసల జల్లు.. ఎంతటి గొప్ప ఆటగాడో అంటూ..
గ్రూప్ -బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాతోపాటు సెమీస్ కు చేరే మరో జట్టు ఏదనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇవాళ జరిగే దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ద్వారా గ్రూప్ -బి నుంచి సెమీస్ కు చేరే మరో జట్టు ఏదనే విషయంపై స్పష్టత రానుంది. అయితే, అఫ్గానిస్థాన్ జట్టుకు కూడా సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో అఫ్గాన్ జట్టుకు అదృష్టం కలిసొస్తుందా అనే అంశం ఉత్కంఠ మారింది.
గ్రూప్-బి పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో టోర్నీ నుంచి ఇప్పటికే ఆ జట్టు నిష్క్రమించింది. ఆస్ట్రేలియా జట్టు నాలుగు పాయింట్లతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, అప్గానిస్థాన్ జట్లు చెరో మూడు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ +2.140 కాగా, అఫ్గానిస్థాన్ జట్టు నెట్ రన్ రేట్ ప్రస్తుతం -0.990గా ఉంది. ఇవాళ జరిగే ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆధారంగా గ్రూప్-బిలోని రెండవ సెమీఫైనలిస్ట్ జట్టు నిర్ణయించబడుతుంది.
అఫ్గానిస్థాన్ సెమీ ఫైనల్స్ కు చేరడం దాదాపు కష్టమనే చెప్పొచ్చు. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోయినా సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ పరంగా అఫ్గానిస్థాన్ జట్టు కంటే అగ్రస్థానంలో ఉంది. అసాధారణంగా ఓడిపోతే తప్ప దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ చేరడం లాంఛనమే. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరుతుంది.
అఫ్గానిస్థాన్ జట్టు సెమీస్ కు చేరాలంటే.. దక్షిణాఫ్రికా జట్టుపై ఇంగ్లాండ్ 207 పరుగులు.. అంతకంటే ఎక్కువ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అలా జరిగే అవకాశాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. ఒకవేళ అలా జరిగితే అఫ్గానిస్థాన్ సెమీస్ లోకి దూసుకెళ్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బి పాయింట్ల పట్టిక
ఆస్ట్రేలియా – 4 పాయింట్లు (+0.475)
దక్షిణాఫ్రికా – 3 పాయింట్లు (+2.140)
ఆఫ్ఘనిస్తాన్ – 3 పాయింట్లు (-0.990)
ఇంగ్లాండ్ – 0 పాయింట్లు (-0.305)
AUSTRALIA HAVE QUALIFIED FOR THE CHAMPIONS TROPHY SEMI FINAL. 🇦🇺 pic.twitter.com/Y7yOEnSFcq
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2025