HCA Elections : హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 20 అక్టోబర్ 2023న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

HCA Elections 2023
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 20 అక్టోబర్ 2023న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్ కు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ పదవీకాలం పూర్తి అయిన తరువాత సుప్రీం కోర్టు హెచ్‌సీఏకు మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇప్పటి వరకు హెచ్‌సీఏ భాద్యతలు చూస్తూ వస్తున్నారు.
ఇటీవల కోర్టు ఆదేశాలతో..
హెచ్‌సీఏలో బహుళ యాజమాన్యంలో ఉన్న 57 క్లబ్‌లపై మూడేళ్ల పాటు నిషేధం విధిస్తూ జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, జాన్‌మనోజ్, చార్మినార్ క్రికెట్ అసోసియేషన్, బడ్డింగ్ స్టార్ క్రికెట్ అసోసియేషన్‌లు న్యాయ స్థానాలను ఆశ్రయించాయి. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్లలేదు.
MS Dhoni : ఐ లవ్ యూ ధోనీ.. అభిమాని పిలుపు.. మిస్టర్ కూల్ రియాక్షన్ మిస్ కాకూడదు.. వీడియో
అయితే.. ఈ విషయంలో ఆయా కోర్టులు ఇచ్చే ఆదేశాలు చెల్లబోవని ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టులకు ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
అక్టోబర్ 4 నుంచి నామినేషన్ల స్వీకరణ..
173 మందితో కూడిన ఓటర్ల జాబితాను విడుదల చేశారు. అక్టోబర్ 4 నుంచి 7 వరకు ఎన్నికల అధికారి వి.సంపత్ కుమార్ నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబరు 14న నామినేషన్లను స్క్రూటినీ ఉంటుంది. అక్టోబర్ 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.