తెలంగాణలోకి యువ క్రికెటర్లకు గుడ్‌న్యూస్. తెలంగాణ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది. తాజాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ.జగన్మోహన్ రావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
బాగా రాణించే యంగ్ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు టీపీఎల్ పేరిట ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ను ఈ ఏడాది నుంచే మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఉమ్మడి జిల్లాకు రూ.కోటి కేటాయిస్తున్నట్టు వివరించారు.
Gold And Silver Price: బంగారం ధరల పరుగులకు బ్రేక్.. ఇప్పుడే కొనుక్కుంటే బెటరా?
నిన్న హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఐపీఎల్ ముగిసిన అనంతరం యంగ్ క్రికెటర్ల కోసం టీపీఎల్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో 10 ఎకరాల చొప్పున కొనుగోలు చేసి కొత్త స్టేడియాలు నిర్మిస్తామని అన్నారు.
ఆ పనులు పూర్తయ్యేవరకు మైదానాలను లీజుకు తీసుకుంటామని తెలిపారు. బాగా రాణిస్తున్న తెలంగాణ క్రికెటర్లను సత్కరించేందుకు వచ్చేనెల హెచ్‌సీఏ అవార్డుల వేడుకను నిర్వహించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియాన్ని ఆధునికీకరించనున్నట్లు తెలిపారు.
కాగా, 2018లో హెచ్‌సీఏ ప్రెసిండెంట్‌గా వివేక్ వెంకటస్వామి ఉన్న సమయంలో జి.వెంకటస్వామి మెమోరియల్ టీటీఎల్ నిర్వహించారు. అప్పట్లో అది బాగా ప్రజాదరణ పొందింది. తిలక్ వర్మ ఆ లీగ్‌తోనే వెలుగులోకి వచ్చాడు. అయితే, అనంతరం వచ్చిన హెచ్‌సీఏ పాలక వర్గం టీపీఎల్‌ను కొనసాగించలేదు. మళ్లీ ఇప్పుడు ఇది ప్రారంభం అవుతుంది.