క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. హైదరాబాద్, విశాఖలోనూ అంతర్జాతీయ మ్యాచులు!
ఈ ప్రతిపాదిత షెడ్యూల్‌పై BCCI అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

టీమిండియా అభిమానులు శుభవార్త. భారత గడ్డపై నాన్-స్టాప్ క్రికెట్ జాతర జరగనుంది. మన దేశంలో వరసగా పలు దేశాలతో సిరీస్‌లు ఉన్నాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అగ్ర జట్లతో టీమిండియా తలపడనుంది. BCCI ప్రతిపాదించిన ఈ హోమ్ సీజన్ షెడ్యూల్ ప్రకారం, దేశంలోని అనేక నగరాల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం..
భారత్ హోమ్ సీజన్ 2025-26
ఈ షెడ్యూల్‌కు త్వరలో BCCI అపెక్స్ కౌన్సిల్ ఆమోదముద్ర వేయనుంది.
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ (2025 అక్టోబర్)
ఈ సిరీస్‌తో హోమ్ సీజన్ ప్రారంభం కానుంది.
ఫార్మాట్: 2 టెస్టులు
వేదికలు (అంచనా): అహ్మదాబాద్, ఢిల్లీ
(ఈ సిరీస్‌కు ముందు, భారత్ ఆస్ట్రేలియాలో 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది)
దక్షిణాఫ్రికాతో భారీ సిరీస్ (2025 నవంబర్ – డిసెంబర్)
భారత్ మూడు ఫార్మాట్లలోనూ తలపడనుంది.
2 టెస్టులు: కోల్‌కతా, గువాహటిలో
3 వన్డేలు: రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నంలో
4 టీ20లు: కటక్, న్యూ చండీగఢ్, ధర్మశాల, లక్నోలో
న్యూజిలాండ్‌తో వైట్-బాల్ సిరీస్ (2026 జనవరిలో)
ఈ సిరీస్‌తో హోమ్ సీజన్ ముగుస్తుంది. కివీస్‌తో వన్డేలు, టీ20ల పోరు జరగనుంది.
ఫార్మాట్: 3 వన్డేలు, 5 టీ20లు
పరిశీలనలో ఉన్న వేదికలు: హైదరాబాద్, జైపూర్, మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్, గువాహటి, తిరువనంతపురం, నాగ్‌పూర్. వీటిని షార్ట్‌లిస్ట్ చేశారు.
అసలైన సవాల్: T20 వరల్డ్ కప్ 2026
ఈ హోమ్ సిరీస్‌లన్నీ ముగిసిన వెంటనే, అసలైన సమరానికి తెరలేవనుంది.
టోర్నమెంట్: T20 వరల్డ్ కప్ 2026
ఎప్పుడు?: 2026 ఫిబ్రవరి – మార్చి
ఆతిథ్య దేశాలు: భారత్, శ్రీలంక
భారత్ లక్ష్యం: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఆ తర్వాతే, అభిమానులను ఉర్రూతలూగించే IPL 2026 సీజన్ ప్రారంభం కానుంది.