Murali Vijayతో డిన్నర్‌కి వెళ్తా.. బిల్లు కట్టను: Ellyse Perry

  • Published By: Subhan ,Published On : May 4, 2020 / 05:57 AM IST
Murali Vijayతో డిన్నర్‌కి వెళ్తా.. బిల్లు కట్టను: Ellyse Perry

Updated On : May 4, 2020 / 5:57 AM IST

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఆల్-రౌండర్ ఎలిస్ పెర్రీ ఎట్టకేలకు టీమిండియా టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ కోరికకు ఒప్పుకుంది. తనతో కలిసి డిన్నర్‌కు వెళ్లాలని ఉందని అడిగిన ప్రశ్నకు అదే రేంజ్‌లో రెస్పాన్స్ ఇచ్చింది. ఇటీవల స్పోర్ట్స్ యాంకర్ రూపా రమణి ఎవరైనా ఇద్దరి క్రికెటర్లతో డిన్నర్ కు వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తారని మురళీ విజయ్ ను అడిగింది. 

‘ఎలిస్ పెర్రీ చాలా అందంగా ఉంటుంది. ఆమెతో డిన్నర్ కు వెళ్తా. ఇంకొకరు శిఖర్ ధావన్.. ఏ రోజైనా అతను చాలా సరదాగా ఉంటాడు. అతను హిందీలో మాట్లాడితే నేను తమిళంలో ఆన్సర్ చేస్తాం అని ఇనిస్టాగ్రామ్ లైవ్ లో చెప్పుకొచ్చాడు. ఎలిస్ పెర్రీ వన్డేల్లో ఇంటర్నేషనల్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మాత్రమే కాకుండా నెం.1 ఆల్ రౌండర్ కూడా. 

ఈ కామెంట్లపై ఎలిస్ పెర్రీ కూడా రెస్పాండ్ అయింది. డిన్నర్ కు సరే కానీ, ఆ బిల్లు మాత్రం అతనే చెల్లించాల్సి ఉంటుంది. అని యాంకర్ కు సమాధానమిచ్చింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న పెర్రీ.. షట్ డౌన్ క్రికెట్ బోర్డులకు ఆర్థిక సమస్యలు తెచ్చిపెట్టిందని కామెంట్ చేసింది. 

ఆస్ట్రేలియా క్రికెట్ ఆర్థిక సంక్షోభంలో పడింది. రెవెన్యూ ఉత్పత్తి చేయడానికి అధికారులు కొత్త పద్ధతులు ట్రై చేస్తారనుకుంటున్నానని పెర్రీ వ్యాఖ్యానించింది. క్రీడకు ఎప్పుడూ గడ్డుకాలమే ఉంటుందనుకోను. ఆర్గనైజేషన్లు మళ్లీ నిలదొక్కుకునేందుకు ఆలోచించాలి.  ఇది మహిళా క్రీడలపైనే కాదు. జనాభా మొత్తం మీద ఒకే ప్రభావం చూపిస్తుంది’ అని ఎలిస్ పెర్రీ కామెంట్ చేసింది.